Begin typing your search above and press return to search.

'ఆహా'కోసం నిర్మాతగా మారనున్న ప్రముఖ డైరెక్టర్

By:  Tupaki Desk   |   21 March 2020 3:10 PM IST
ఆహాకోసం నిర్మాతగా మారనున్న ప్రముఖ డైరెక్టర్
X
టాలీవుడ్ సూపర్ టాలెంటెడ్ సెన్సిబుల్ డైరెక్టర్ క్రిష్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో తెరకెక్కించనున్న పీరియాడిక్ సినిమా పనులలో బిజీగా ఉన్నాడు. గమ్యం, వేదం, కంచె, గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి సినిమాలతో తనకంటూ ఒక సెన్సిబుల్ మార్క్ క్రియేట్ చేసుకున్నాడు క్రిష్. అంతరిక్షం సినిమాతో నిర్మాతగా కూడా మారిన ఆయన త్వరలోనే వెబ్ సిరీస్ లను కూడా నిర్మించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ విషయంపై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తో డీల్ కుదుర్చుకున్నాడట. క్రిష్ కి ఆల్రెడీ పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఉన్న సంగతి తెలిసిందే. ఆ ప్రొడక్షన్ హౌస్ ను తండ్రి సాయిబాబా, ఫ్రెండ్ రాజీవ్ రెడ్డిలు చూసుకుంటారు.

రాబోయే కాలంలో క్రిష్ ఇంకా అల్లు అరవింద్ ఇద్దరు కలిసి సంయుక్తంగా 'ఆహా' కోసం వెబ్ సిరీస్ లను రూపొందించనున్నారు. ఆహాలో విడుదలయ్యే వెబ్ సిరీస్ల స్క్రిప్ట్ పనులను క్రిష్ పర్యవేక్షిస్తాడని, అల్లు అరవింద్ ఇతర ప్రాజెక్టులను చూసుకుంటాడని సమాచారం. ఈ విధంగా ఇద్దరు బాధ్యతలను షేర్ చేసుకున్నారట. వీరిద్దరూ కలిసి ఇప్పటికే 'రన్' అనే వెబ్ సిరీస్ ని రూపొందిస్తున్నారు. నవదీప్, పూజిత పొన్నాడ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ వెబ్ సిరీస్ ను లక్ష్మీకాంత్ చెన్నా డైరెక్ట్ చేస్తున్నాడు. త్వరలోనే రన్ సిరీస్ ఆహాలో విడుదల కానున్నట్లు తెలిపారు. అంటే త్వరలోనే డైరెక్టర్ క్రిష్ సినిమాల నుండి వెబ్ సిరీస్ లకు అంకితం అవుతాడని టాలీవుడ్ సినీ విశ్లేషకులు, అభిమానులు భావిస్తున్నారు.