Begin typing your search above and press return to search.
పవన్ సినిమా నుంచి తప్పుకున్న ప్రముఖ సినిమాటోగ్రాఫర్..?
By: Tupaki Desk | 14 July 2021 7:00 PM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి హీరోలుగా '#PSPKRana' వర్కింగ్ టైటిల్ తో ఓ మల్టీస్టారర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన 'అయ్యప్పనుమ్ కొశీయుమ్' చిత్రానికి ఇది అధికారిక తెలుగు రీమేక్. సాగర్ కె.చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దీనికి స్క్రీన్ ప్లే - డైలాగ్స్ అందించడంతో పాటుగా మెంటర్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
'ఏకే' రీమేక్ కోసం ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ప్రసాద్ మూరెళ్ల వర్క్ చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పటి వరకు జరిగిన 40 శాతం షూటింగ్ కూడా ప్రసాద్ మూరెళ్ల ఆధ్వర్యంలోనే జరిగింది. అయితే ఇప్పుడు ప్రసాద్ ఈ చిత్రం నుంచి తప్పుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు కెమెరామెన్ గా వ్యవహరించిన ప్రసాద్ మూరెళ్ల.. పవన్ - త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన 'అత్తారింటికి దారేది' చిత్రానికి పని చేసారు. అలానే త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన 'సన్నాఫ్ సత్యమూర్తి' తో పాటుగా.. పవన్ 'కాటమరాయుడు' చిత్రానికి కూడా ఆయనే సినిమాటోగ్రాఫర్.
ఈ క్రమంలో మరోసారి పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ లతో కలిసి '#PSPKRana' కోసం వర్క్ చేయడం ప్రారంభించారు. అయితే కారణాలేంటి అనేది తెలియదు కానీ.. ప్రసాద్ మూరెళ్ల ఈ చిత్రం నుంచి బయటకు వచ్చేసారని అంటున్నారు. అంతేకాదు ఆయన స్థానంలో సినిమాటోగ్రాఫర్ గా రవి కె.చంద్రన్ ను తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది. రవి చంద్రన్ తమిళ మలయాళ హిందీ భాషల్లో 'బాయ్స్' 'అమృత' 'యువ' 'సిటిజెన్' 'ఫనా' 'బ్లాక్' 'రబ్ నే బనాదీ జోడి' 'గజినీ' 'మై నేమ్ ఈజ్ ఖాన్' 'ఓకే జాను' 'ఆదిత్య వర్మ' వంటి అనేక విజయవంతమైన చిత్రాలను పని చేశారు. ఇక తెలుగులో మహేష్ బాబు - కొరటాల శివ కాంబోలో వచ్చిన 'భరత్ అనే నేను' చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించారు. ఈ క్రమంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ చిత్రానికి వర్క్ చేయనున్నారని అంటున్నారు. మరి కెమెరామెన్ ను మార్చిన విషయంపై మేకర్స్ అధికారికంగా ప్రకటించి, త్వరలోనే క్లారిటీ ఇస్తారేమో చూడాలి.
కాగా, 'అయ్యప్పనుమ్ కొశీయుమ్' స్క్రిప్ట్ లో పలు మార్పులు చేర్పులు చేసి తెలుగులో రూపొందిస్తున్నారు. పవన్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని మాతృకలో లోని ఫ్లాష్ బ్యాక్ ని కొత్తగా జత చేస్తున్నారు. మలయాళంలో బీజూ మీనన్ పోషించిన నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ కల్యాణ్ నటిస్తుండగా.. పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన రిటైర్ట్ హవల్దార్ రోల్ లో రానా కనిపించనున్నారు. నిత్యా మీనన్ - ఐశ్వర్య రాజేష్ ఈ చిత్రంలో హీరోయిన్ లుగా నటిస్తున్నారు. పవన్ ఇందులో ఓ ఫోక్ సాంగ్ పాడటానికి రెడీ అయ్యారని తెలుస్తోంది.
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దీనికి ఎస్ ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రానికి ''పరశురామ కృష్ణమూర్తి'' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో నిలిచిపోయిన 'ఏకే' రీమేక్ షూటింగ్ ను తిరిగి స్టార్ట్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. 'హరి హర వీరమల్లు' సినిమా వాయిదా పడితే.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా 'PspkRana' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.