Begin typing your search above and press return to search.

ఫ్యామిలీ మ్యాన్స్‌ మరిన్ని సినిమా బండ్లు వస్తున్నాయట

By:  Tupaki Desk   |   9 July 2021 6:30 AM GMT
ఫ్యామిలీ మ్యాన్స్‌ మరిన్ని సినిమా బండ్లు వస్తున్నాయట
X
బాలీవుడ్‌ దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే ది ఫ్యామిలీ మ్యాన్‌ రెండు సీజన్ లతో దేశ వ్యాప్తంగా మంచి పాపులారిటీని దక్కించుకున్నారు. హిందీలో వీరు వరుసగా ప్రాజెక్ట్‌ లు చేస్తున్నారు. ఒక వైపు దర్శకులుగా వీరిద్దరు వరుస సినిమాలు చేస్తూనే వెబ్‌ సిరీస్ లు చేస్తున్నారు. మరో వైపు ప్రొడక్షన్‌ హౌస్‌ ను ప్రారంభించి నిర్మాణం మొదలు పెట్టారు. వీరి నిర్మాణంలో ఇప్పటికే కొన్ని చిన్న సినిమాలు మరియు వెబ్‌ ప్రాజెక్ట్‌ లు వచ్చాయి.

త్వరలో మరిన్ని సినిమాలు వీరి బ్యానర్ నుండి వస్తాయంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. వీరిద్దరు తెలుగు పై ప్రత్యేక శ్రద్ద పెడుతున్నారట. ఇప్పటికే సినిమా బండి అనే విభిన్నమైన చిన్న వెబ్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన ఈ దర్శక ద్వయం అతి త్వరలో కొన్ని సినిమాలను నిర్మించేందుకు కథలు కూడా సిద్దం చేసుకున్నారట.

తమ నిర్మాణంలో కొత్త దర్శకులు మరియు నటీనటులతో వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు రూపొందబోతున్నట్లుగా వారు చెబుతున్నారు. మొదటగా తెలుగులో వీరి వరుస సినిమా లు ఉంటాయని మీడియా వర్గాల ద్వారా తెలుస్తోంది. కొత్త వారితో పాటు కొందరు పాత దర్శకులతో కూడా వీరు చర్చలు జరిపారని... త్వరలోనే వీరి నిర్మాణంలో ఒక ప్రాజెక్ట్‌ మొదలు కాబోతుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల టాక్‌. పెద్ద ఎత్తున వీరి ప్రాజెక్ట్‌ లపై అంచనాలు ఉంటాయి. వీరి సినిమా అంటే ఖచ్చితంగా స్పెషల్ గా ఉంటుందని సినిమా బండి చూసిన వారు అంటూ ఉన్నారు. రాజ్‌ అండ్ డీకే లు చేయబోతున్న ప్రాజెక్ట్‌ ల కోసం ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుడు కూడా వెయిట్‌ చేస్తున్నాడు.

పలువురు దర్శకులు ఈమద్య కాలంలో నిర్మాతలుగా మారి మంచి విజయాలను దక్కించుకున్నారు. ఇప్పటికే రాజ్‌ అండ్ డీకే ద్వయం కూడా మంచి విజయాలను నిర్మాతలుగా దక్కించుకోవడంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకున్నారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన బ్రాండ్‌ వ్యాల్యూ భారీగా ఉంది. కనుక వీరి నిర్మాణంలో రూపొందుతున్న సినిమాలు అంటే ఖచ్చితంగా మంచి మార్కెట్ ను కలిగి ఉంటుంది. అందుకే వీరి సినిమాలు ముందు ముందు తెలుగు ప్రేక్షకుల్లో సందడి చేయడం ఖాయం అంటున్నారు.