Begin typing your search above and press return to search.
సామ్ ని సర్ ప్రైజ్ చేసిన 'ది ఫ్యామిలీ మ్యాన్' టీమ్...!
By: Tupaki Desk | 29 April 2020 9:30 PM ISTసమంత అక్కినేని తెలుగులో 'ఏమాయ చేశావే' సినిమాతో పరిచయమై కుర్రకారుని తనదైన మాయలో పడేసిన తమిళ అమ్మాయి. ఆ సినిమాలో నాగచైతన్య సరసన నటించిన సమంత అతన్నే ప్రేమించి పెళ్లిచేసుకుని తెలుగింటి కోడలైంది. సమంత ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోయిన్‌లో ఒకరుగా వెలుగుతోంది. సమంత ఇటు సినిమాల్లో నటిస్తూనే అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం అయ్యే 'ది ఫ్యామిలీ మ్యాన్ 2’ అనే వెబ్ సిరీస్ లో సమంత కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. 'ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ లో సామ్ నెగిటివ్ రోల్ లో కనిపించనున్నారు. ఇదిలా ఉండగా సమంతను ‘ది ఫ్యామిలీ మ్యాన్’ బృందం సర్‌ప్రైజ్ చేసింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
మంగళవారం సామ్ తన 33వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులతోపాటు అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలో 'ది ఫ్యామిలీ మ్యాన్' యూనిట్ సభ్యుడు సామ్ కి కాల్ చేసి వీడియో కాల్ అటెండ్ చేయమని చెప్పాడట. దీంతో వీడియో కాల్ ఓపెన్ లిఫ్ట్ చేసిన సమంత షాక్ కి గురైందంట. దానికి కారణం ఆ వీడియో చాట్ లో ఈ వెబ్ సిరీస్ కోసం పనిచేసిన దాదాపు 10 మంది ప్రత్యక్షమయ్యారంట. అందరూ ఒకేసారి బర్త్ డే సాంగ్ పడుతూ ఆమెకి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ విషయాన్ని సమంత తెలియజేస్తూ ‘మొత్తం టీంకు నా ధన్యవాదాలు. ‘ది ఫ్యామిలీ మెన్’ సీజన్ 2 కోసం ఎదురుచూస్తున్నా. ఇది ఓ గుడ్ హ్యాపీ బర్త్ డే’ అని పోస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో అయితే రిలీజ్ చేయలేదు కానీ ఆ వీడియో కాల్ స్క్రీన్ షాట్ మాత్రం పోస్ట్ చేసి వారికి కృతజ్ఞతలు తెలిపింది.
ఇదిలా ఉండగా ఇప్పటికే 'ది ఫ్యామిలీ మ్యాన్' ఫస్ట్ సీజన్ ప్రసారం అయ్యి మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. మొదటి సీజన్ లో మనోజ్ బాజ్ పాయ్ - ప్రియమణి - సందీప్ కిషన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ పాపులర్ హిందీ వెబ్ సిరీస్ 'ది ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ రెండో సీజన్ లో సమంత పాత్రకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంది. దీనికి తోడు ఆమె పోషించేది టెర్రరిస్ట్ పాత్ర కావడంతో ఆసక్తి మరింత పెరుగుతోంది. మొదటి సిరీస్ కు మించి ఈ రెండో సిరీస్ పాపులర్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. తెలుగు దర్శకులు రాజ్ నిడిమోరు - కృష్ణ డీకేలు ఈ వెబ్ సిరీస్ ను దర్శకత్వం వహిస్తున్నారు.