Begin typing your search above and press return to search.

'ఫ్యామిలీ మ్యాన్ సీజ‌న్ 2' వాయిదా లేదు!

By:  Tupaki Desk   |   4 Feb 2021 4:06 PM GMT
ఫ్యామిలీ మ్యాన్ సీజ‌న్ 2 వాయిదా లేదు!
X
మోస్ట్ అవైటెడ్ ఫ్యామిలీ మ్యాన్ సీజ‌న్ 2 స్ట్రీమింగ్ ఎపుడు? ఇన్నాళ్లు అభిమానులు ఎంతో ఓపిగ్గా వేచి చూసి చివ‌రికి డేట్ ఇవ్వ‌క‌పోవ‌డంతో ఎంతో అస‌హ‌నం వ్య‌క్త‌మైంది. తొలి సీజ‌న్ ఘ‌న‌విజ‌యం నేప‌థ్యంలో ఎంతో ఉత్కంఠ‌గా వేచి చూసిన ఫ్యాన్స్ ని రాజ్ అండ్ డీకే బృందం తీవ్రంగా నిరాశ‌ప‌రిచింది.

ఎట్ట‌కేల‌కు తేదీ లాక్ అయ్యింద‌ని ఇంత‌కుముందే వెల్ల‌డించినా ఇంకా సందేహాలు నెల‌కొన్నాయి. మ‌రోసారి ఈ సిరీస్ వాయిదా ప‌డ‌నుంద‌ని ఇటీవ‌ల ప్ర‌చార‌మైంది. ఆ క్ర‌మంలోనే మ‌రోసారి క్లారిటీ నిస్తూ ఎలాంటి వాయిదా లేద‌ని అమెజాన్ ప్రైమ్ టీమ్ వెల్ల‌డించింది. అమెజాన్ ప్రైమ్ వీడియో లో మోస్ట్ అవైటెడ్ వెబ్ సిరీస్ సీజన్ 2 వాయిదా వేయలేదు. షెడ్యూల్ ప్రకారం 2021 ఫిబ్రవరి 12 న ప్రదర్శిత‌మ‌తుందని టీమ్ తెలిపింది.

అమెజాన్ సిరీస్ లు.. తాండవ్ .. మీర్జాపూర్ వివాదాస్ప‌దం కావ‌డంతో ఆ త‌ర‌హా వివాదాల‌కు ఆస్కారం ఉంటుంద‌ని ఫ్యామిలీ మ్యాన్ 2 పైనా ప్ర‌చారం సాగింది. దీంతో అమెజాన్ ప్రైమ్ స్వ‌యంగా రంగంలోకి దిగి ఈ క్లారిటీనిచ్చింది. ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 విడుదల తేదీ ఆలస్యం అవుతుందా? అని ఒక అభిమాని అమెజాన్‌ను అడిగినప్పుడు ఫిబ్రవరి 12న య‌థాత‌థంగా‌ ప్రత్యక్ష ప్రసారం అవుతుందని వెల్ల‌డించింది. మ‌నోజ్ భాజ్ పాయ్- ప్రియ‌మ‌ణి- స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన ఈ సిరీస్ ఏ మేర‌కు మెప్పించ‌నుంది? అన్న‌ది వేచి చూడాలి.