Begin typing your search above and press return to search.

ఫ్యామిలీ మ్యాన్ ఈసారి మరింత ఇంట్రెస్ట్‌..!

By:  Tupaki Desk   |   26 Oct 2022 11:30 AM GMT
ఫ్యామిలీ మ్యాన్ ఈసారి మరింత ఇంట్రెస్ట్‌..!
X
ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్‌ సిరీస్‌ తో దేశ వ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకున్న స్టార్ మనోజ్ బాజ్‌ పేయి. ఈయన వెబ్ సిరీస్ కి ముందు హిందీతో పాటు పలు సౌత్ సినిమాల్లో కూడా నటించాడు. కానీ ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌ తోనే స్టార్‌ గా సూపర్ స్టార్‌ గా అందరికి సుపరిచితుడు అయిన విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

మనోజ్ బాజ్‌ పేయి మరో ఇంట్రెస్టింగ్‌ ఓటీటీ ప్రాజెక్ట్‌ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. ఈయన ప్రధాన పాత్రలో గలీ గులియన్‌ అనే చిత్రం రూపొందింది. దీపేష్ జైన్‌ స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా నిర్మాణం జరిగింది.

ఢిల్లీ గల్లీల్లో చిక్కుకున్న ఒక వ్యక్తి మానసిక సంఘర్షణ.. అక్కడి నుండి అతడు స్వాతంత్య్రం పొందేందుకు ప్రయత్నించే విధానంను ఈ సినిమాలో చక్కగా చూపించారట. ప్రతి సన్నివేశం కూడా మనసుకు హత్తుకునేలా ఉంటుందని మేకర్స్ బలంగా చెబుతున్నారు.

ఇప్పటికే ఈ సినిమాను పలు ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శించారు. విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు నటుడిగా మనోజ్ బాయ్ పాయి ని మరో యాంగిల్‌ లో అద్భుతంగా చూపించబోతున్న ఈ సినిమా ను అమెజాన్‌ ప్రైమ్ వారు త్వరలో స్ట్రీమింగ్‌ చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.

తాను ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించాను. కానీ ఈ పాత్ర అత్యంత ఛాలెంజింగ్‌ పాత్రగా నిలుస్తుంది అంటూ ఆయన పేర్కొన్నాడు. అమెజాన్ లో స్ట్రీమింగ్ కు రెడీ గా ఉన్న ఈ సినిమా ను హిందీ భాషలో స్ట్రీమింగ్‌ చేసి.. ఆ తర్వాత ఇతర భాషల్లో కూడా అందుబాటులో ఉంచే విషయమై అమెజాన్‌ ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.