Begin typing your search above and press return to search.

హాట్ టాపిక్ గా మారిన సర్కారు వారి వయాగ్రా డైలాగ్..!

By:  Tupaki Desk   |   5 May 2022 10:00 AM IST
హాట్ టాపిక్ గా మారిన సర్కారు వారి వయాగ్రా డైలాగ్..!
X
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం ''సర్కారు వారి పాట''. పరశురామ్ పెట్లా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూసిన ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదలై సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. టాలీవుడ్ లో 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన ట్రైలర్ గా సరికొత్త రికార్డ్ సృష్టించింది.

ప్రస్తుతం SVP ట్రైలర్ 30 మిలియన్ల వ్యూస్ మరియు 1.2 మిలియన్ లైక్స్ తో యుట్యూబ్ లో ట్రెండింగ్ లో కొనసాగుతోంది. మొత్తానికి హై వోల్టేజ్ యాక్షన్ బ్లాక్స్ - లవ్ - కామెడీ - ఎమోషన్ కలబోసిన ఈ పవర్ ప్యాక్డ్ ట్రైలర్ సినీ అభిమానులకు విపరీతంగా నచ్చేసింది. సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది.

ముఖ్యంగా వింటేజ్ మహేష్ కనిపించారని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. సూపర్ స్టార్ మాస్ స్వాగ్ - డైలాగ్స్ వారిని బాగా ఆకట్టుకున్నాయి. శ్రీకాకుళం యాసలో మహేష్ పలికిన డైలాగులు చాలా కొత్తగా అనిపించాయి. అయితే ఇందులో ఒకటీ రెండు డైలాగ్స్ మాత్రం ఓ వర్గం ప్రేక్షకులకు అంతగా నచ్చలేదు.

ట్రైలర్ చివరలో మహేష్ బాబు స్టైల్ గా ఓ కుర్చీలో కూర్చొని ''ఓ వంద వ‌యాగ్రాలేసి శోభ‌నం కోసం వెయిట్ చేస్తున్న పెళ్లి కొడుకు గ‌దికొచ్చిన‌ట్లు వ‌చ్చారు'' అంటూ వైలెంట్ వాయిస్ తో డైలాగ్ చెప్తారు. రౌడీలను చితక్కొట్టడానికి తాను తహతహలాడుతున్నానని తెలిపేందుకే మహేష్ ఈ డైలాగ్ చెప్పాడు. అయితే ఇది మన ఆడియన్స్ కు అడల్ట్ డైలాగ్ గా పరిగణించబడుతుంది.

అలానే మరో సీన్‌ లో 'ఎందుకంటే.. వాడిది మరీ.. పెద్ద..' అంటూ మహేష్ చాలా సీరియస్ గా డబుల్ మీనింగ్ డైలాగ్ చెప్పడం కూడా చర్చకు దారితీసింది. సూపర్ స్టార్ ఫ్యాన్స్ సైడ్ నుంచి ఈ డైలాగ్స్ పై అభ్యంతరం లేకపోయినా.. ఎప్పుడూ డిగ్నిటీగా ఉండే మహేష్ నోటి నుంచి ఇలాంటి మాటలు చాలా మంది ఊహించలేదు. మరి రిలీజ్ అయ్యేలోపు ఈ డైలాగ్స్ పై ఏమైనా ఫిర్యాదులు వస్తాయేమో చూడాలి.

అయితే వయాగ్రా డైలాగ్ చెప్పడానికి ముందు మహేష్ బాబు ఒప్పుకోలేదట. మిస్ ఫైర్ అవుతుందని.. బయట నెగిటివ్ టాక్ వచ్చే అవకాశం ఉందని డిస్కషన్ పెట్టారని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు పరశురాం తెలిపారు. చివరకు ఎలాగోలా బతిమిలాడి ఆయనతో ఆ డైలాగ్ చెప్పించడం జరిగిందని.. బయట ఇప్పుడు దానికి మంచి రెస్పాన్స్ వస్తోందని చెప్పుకొచ్చారు.

'సర్కారు వారి పాట' సినిమాలో మహేశ్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. ఎస్ఎస్ థమన్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చారు. మైత్రీ మూవీ మేకర్స్ - GMB ఎంటర్‌టైన్‌మెంట్ మరియు 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా మే 12న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది.