Begin typing your search above and press return to search.

ర్యాప్ సాంగ్ తో ఎన్టీఆర్ కి విషెస్ చెప్పిన 'ఫలక్‌ నుమా దాస్'...!

By:  Tupaki Desk   |   20 May 2020 7:10 AM GMT
ర్యాప్ సాంగ్ తో ఎన్టీఆర్ కి విషెస్ చెప్పిన ఫలక్‌ నుమా దాస్...!
X
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోని టాప్ హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నందమూరి హీరోగా యాక్టింగ్ - డ్యాన్స్ - డైలాగ్ డెలివరీ - ఫైట్స్‌ లో రాణిస్తూ ఆల్‌ రౌండర్‌ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాకుండా సింగర్‌ గానూ రాణిస్తున్నాడు. ఇన్ని క్వాలిటీస్ ఉన్న హీరో కాబట్టి అతడికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీగానే ఉంది. కొన్నేళ్లుగా సూపర్ ఫామ్‌ లో ఉన్న ఎన్టీఆర్ వరుస సినిమాలతో వరుస విజయాలతో దూకుడు చూపిస్తున్నాడు. కాగా ఈ రోజు నందమూరి నటవారసుడి పుట్టిన రోజు. అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పండుగరోజు. అయితే గతేడాది తన పుట్టిన రోజు వేడుకలకు ఎటువంటి హడావిడి చేయవద్దని ఎన్టీఆర్ అభిమానులను కోరారు. తన తండ్రి హరికృష్ణ చనిపోయి ఇంకా ఏడాది కూడా పూర్తికాలేదని.. ఈ విషాద ఘటన నుంచి తాను ఇంకా తేరుకోలేదని ఎన్టీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. దాంతో అప్పుడు ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ చేయలేదు. ఈ ఏడాది రెండు కలిపి చేయాలి అన్నట్లుగా అంగరంగ వైభవంగా ఇప్పుడు జరపాలని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. కానీ ఈ ఏడాది కూడా ప్రస్తుత పరిస్థితులను బట్టి బర్త్ డే వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు తారక్. అంతేకాకుండా తన అభిమానులు ఇంట్లోనే ఉంటూ భౌతిక దూరాన్ని పాటించాలని విన్నవించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా ఫ్యాన్స్ ఎన్టీఆర్ బర్త్ డే వేడుకలకు దూరం కానున్నారు.

కాకపోతే సోషల్ మీడియా వేదికగా తమ అభిమాన హీరో పుట్టిన రోజు వేడుకలను ఒక రేంజ్ లో సెలెబ్రేట్ చేయడం స్టార్ట్ చేసారు. సోషల్ మీడియాలో ఇప్పటికే ట్రెండ్ స్టార్ట్ చేసి రికార్డ్స్ క్రియేట్ చేసే దిశగా దూసుకుపోతున్నారు. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ కి ఉన్న డై హార్డ్ ఫ్యాన్స్ లో యువ హీరో విశ్వక్ సేన్ ఒకరు. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ''మాస్ కా దాస్.. మాస్ కా బాప్ ఫలక్‌ నుమా దాస్'' ర్యాప్ సాంగ్‌ ను ఎన్టీఆర్‌ కు అంకితం ఇవ్వబోతున్నానని విశ్వక్ సేన్ ప్రకటించిన విషయం తెలిసిందే. చెప్పినట్లుగానే ఈరోజు సర్ప్రైజ్ ర్యాప్ సాంగ్ తో తారక్ కి బర్త్ డే విషెస్ తెలియజేసాడు. 'హ్యాపీ బర్త్ డే మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మీ మీద ప్రేమతో ఈ చిన్న వీడియో'' అంటూ ట్విట్టర్ లో ఈ వీడియో లింక్ పోస్ట్ చేసాడు విశ్వక్. 'మాస్ కా దాస్ ట్రిబ్యూట్ టూ మాస్ కా బాప్ ఎన్టీఆర్' అనే ఈ ర్యాప్ సాంగ్ సంగీత దర్శకుడు వివేక్ సాగర్ కంపోజ్ చేయగా ఆదిత్యారావు గంగసాని ర్యాప్ సాంగ్ రాసి పాడాడు. తారక్ సినిమాలోంచి మాస్ స్టిల్స్ తీసుకొని విశ్వక్ సేన్ ఈ వీడియో ఎడిట్ చూపించారు. దీంతో ఎన్టీఆర్ అభిమానులు విశ్వక్ ని అభినందిస్తూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.