Begin typing your search above and press return to search.
త్రివిక్రమ్ అలా చేయడం లేదు
By: Tupaki Desk | 24 Jan 2018 11:56 AM ISTటాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న బడా దర్శకుల్లో త్రివిక్రమ్ ఒకరని అందరికి తెలిసిన విషయమే. తన కలంతో జీవిత సత్యాల గురించే కాకుండా నవ్వించే పంచ్ లు వేయడంలో కూడా ఆయన ముందుంటారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే గత కొంత కాలంగా ఆయన చాలా బాధగా ఉన్నారని పలు రకాల రూమర్స్ టాలీవుడ్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. భారీ అంచనాల నడుమ విడుదలైన అజ్ఞాతవాసి డిజాస్టర్ అవ్వడంతో కొంచెం నిరాశలో ఉన్నారని తెలుస్తోంది.
ఇక రీసెంట్ గా ఆయన డైరెక్షన్ యూనిట్ పై కూడా ఊహించని నిర్ణయం తీసుకున్నారని టాక్ వచ్చింది. నెక్స్ట్ ఎన్టీఆర్ ప్రాజెక్టుకు కొత్త డైరెక్షన్ టీమ్ ను సెట్ చేసుకోవాలని అనుకున్నారట. ఎందుకంటే అజ్ఞాతవాసి సినిమా డిజాస్టర్ అవ్వడానికి కారణం వారు కూడా అని నిర్ణయాలను సరి చేయలేకపోవడంతో వారితో ఇక కొనసాగకూడదని త్రివిక్రమ్ నిర్ణయం తీసుకున్నట్లు మీడియాల్లో కథనాలు వెలువడ్డాయి.
కానీ రీసెంట్ గా డైరెక్షన్ యూనిట్ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం అందులో ఎలాంటి నిజం లేదని తెలిసింది. దర్శకుడు త్రివిక్రమ్ ఆ విధంగా అస్సలు ఆలోచించలేదని తెలిసింది. అజ్ఞాతవాసి సినిమాకు ఉన్న డైరెక్షన్ యూనిట్ ఎన్టీఆర్ సినిమాకు కూడా కొనసాగుతారని తెలిసింది. ఇక ఆ సినిమా మార్చ్ లో లేదా ఏప్రిల్ లో స్టార్ట్ కానుంది. కామెడీ అండ్ ఫ్యామిలీ ఎమోషనల్ టచ్ ఉన్న సినిమాగా ఆ కథ తెరకెక్కనుందని ఎన్టీఆర్ ఇదివరకు చెప్పిన సంగతి తెలిసిందే.