Begin typing your search above and press return to search.

ఆడిషన్‌ కని పిలిచి రేప్ చేశాడు

By:  Tupaki Desk   |   2 April 2019 2:40 PM IST
ఆడిషన్‌ కని పిలిచి రేప్ చేశాడు
X
‘మీ టూ’ మూమెంట్లో భాగంగా ఎందరో అమ్మాయిల గోడు విన్నాం. సినిమా అవకాశాల పేరుతో వల విసిరి అమ్మాయిల జీవితాలతో ఆడుకునే దుర్మార్గుల కథలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ఐతే ఇంకా కూడాా ఈ అరాచకాలేమీ ఆగట్లేదు. ‘మీ టూ’మూమెంట్ నడుస్తుండగానే అమ్మాయిలపై ఇలాంటి అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఐతే ఈ అరాచకాల్ని మౌనంగా భరిస్తూ వచ్చిన వాళ్లు.. చివరికి కొంత ధైర్యం తెచ్చుకుని తమకు జరిగిన అన్యాయాల్ని బయటపెడుతుంటం మాత్రం మంచి పరిణామం. తాజాగా ఒక అమ్మాయి ఇలాగే బయటపడింది. రెండేళ్లకు పైగా తనపై జరుగుతున్న అఘాయిత్యాన్ని బయటపెట్టింది. బెంగళూరులో జరిగిన ఈ దారుణం గురించిన వివరాలేంటో చూద్దాం పదండి.

ఆమె ఒక అందమైన యువతి. సినిమాల్లో నటించాలన్న కోరిక ఉంది. ఈ సంగతి తెలిసి ఒక వ్యక్తి ఆమెను అప్రోచ్ అయ్యాడు. తాను ఒక నిర్మాతనని.. సినిమా అవకాశాలు ఇప్పిస్తానని అన్నాడు. ఆమె అందాన్ని పొగిడి కచ్చితంగా సినిమాల్లో రాణించగలవని ఊరించాడు. ఆడిషన్స్ కోసం ఒక చోటికి రమ్మన్నాడు. ఆమె అమాయకంగా అది నిజమని భావించి వెళ్లింది. కానీ వెళ్లాక తలుపు వేసి ఆమె మీద అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తర్వాత ఈ విషయం బయటికి పొక్కితే.. నీ కుటుంబ పరువు పోతుందని, పెళ్లి జరగదని హెచ్చరించాడు. పైగా ఆమె నగ్నంగా ఉన్న ఫొటోలు, వీడియోలు కూడా తీసి పెట్టుకుని తర్వాత బెదిరించడం మొదలుపెట్టాడు. ఇవి చూపించి మళ్లీ మళ్లీ ఆమెపై అఘాయిత్యం జరిపాడు. రెండేళ్ల పాటు ఈ దారుణం కొనసాగింది. ఐతే ఇక భరించలేక ఆమె తాజాగా బయటికి వచ్చింది. ఏం జరిగితే జరగనివ్వని అనుకుని పోలీసుల్ని ఆశ్రయించింది. సదరు వ్యక్తి తనను ఎలా మోసం చేసింది.. ఎలా అఘాయిత్యాలకు పాల్పడుతున్నది వెల్లడించింది. పోలీసులు ఆ వ్యక్తిని అరెస్టు చేసి విచారిస్తున్నారు.