Begin typing your search above and press return to search.

రజినీ సినిమా ఫస్ట్ లుక్ కాదు మొర్రో

By:  Tupaki Desk   |   4 Oct 2016 5:40 AM GMT
రజినీ సినిమా ఫస్ట్ లుక్ కాదు మొర్రో
X
ఈ మధ్య సినీ పరిశ్రమను లీకుల హంగామా పరుగులు పెట్టించేస్తోంది. రిలీజ్ కి రెడీ అయిన సినిమాలు.. పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న మూవీస్ కూడా లీక్ అవుతుండగా.. నిర్మాణంలోనే ఉండగా లీకుల హంగామా స్టార్ట్ అయిపోవడం లేటెస్ట్ ట్రెండ్. ముఖ్యంగా భారీ బడ్జెట్ చిత్రాలను ఈ జంఝాటం బాగా వెంటాడుతోంది. శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఇప్పుడు రోబోకు సీక్వెల్ 2.0 చిత్రాన్ని చేస్తున్నారు.

దాదాపు 300 కోట్లతో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మూవీ 2.0 ఫస్ట్ లుక్ లీక్ అయిందంటే.. నెట్ లో ఓ ఫోటో తెగ హల్ చల్ చేస్తోంది. థీమ్ ప్రకారం చూసుకుంటే నమ్మేట్లుగా ఉండడంతో చాలామంది లీకు న్యూన్ ని నమ్మశారు కూడా. అయితే.. కాసింత బ్రెయిన్ పెట్టి చూస్తే ఇది ఒరిజినల్ కాదనే సంగతి తేలిపోతుంది. మొదటగా చెప్పుకోవాల్సింది రజినీకాంత్ పేరు గురించే. సూపర్ స్టార్ పేరును RAJNIKANTHగా రాయడం స్టార్ట్ చేసి రెండు దశాబ్దాలు దాటిపోయింది. మధ్యలో ఉండే ఒక 'ఐ'ని ఎప్పుడో కత్తిరించేశారు.

ఇక ఏఆర్ రెహమాన్ పేరును.. రెండో లైన్ లో ఉంచడం కూడా హాస్యాస్పదమే. డబుల్ ఆస్కార్ విన్నర్ పేరును ఖచ్చితంగా ఫస్ట్ లైన్ లోనే డిస్ ప్లే చేయాల్సి ఉంటుంది. మరోవైపు.. డైరెక్టెడ్ బై శంకర్ అనడం కూడా మిస్టేక్ గానే చెప్పాలి. ఏ ఫిలిమ్ బై శంకర్ అనే ట్యాగ్ ను చాలా కాలంగా చూస్తున్నాం. మరోవైపు డైలాగ్ రైటర్ స్పెల్లింగ్ మిస్టేక్ చూస్తే.. ఇది ఒరిజినల్ కాదనే సంగతిని ఒప్పుకోక తప్పదు. ఇది ఒరిజినల్ కాదనే విషయాన్ని నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ కూడా అఫీషియల్ గానే చెబుతోంది.




Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/