Begin typing your search above and press return to search.

ఫేక్ కలెక్షన్స్ నా.. నిజమేనా..?

By:  Tupaki Desk   |   20 Feb 2021 9:00 AM GMT
ఫేక్ కలెక్షన్స్ నా.. నిజమేనా..?
X
మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీ 'ఉప్పెన' విడుదలైన మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తో మంచి వసూళ్ళు రాబట్టింది. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ - సుకుమార్ రైటింగ్స్ కలిసి నిర్మించాయి. ఈ చిత్రానికి ఫస్ట్ వీక్ లోనే 70కోట్లు కలెక్షన్స్ వచ్చినట్లు మేకర్స్ అధికారికంగా పోస్టర్ కూడా వదిలారు. అయితే 'ఉప్పెన' సినిమాకు వ‌స్తున్న హ్యూజ్ కలెక్ష‌న్స్ ఫిగ‌ర్స్ మీద ఇండ‌స్ట్రీ మొత్తం ర‌స‌వ‌త్త‌ర చ‌ర్చ న‌డుస్తోంది.

'ఉప్పెన' చిత్రాన్ని మైత్రీ వారు సొంతగా రిలీజ్ చేసుకున్నారనే విషయం తెలిసిందే. థియేట‌ర్ హైర్లు త‌దిత‌ర ట్రేడ్ లెక్కులు అన్నీ క‌లిపేసుకుని మా సినిమా అంత చేసింది ఇంత చేసిందని పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ క‌లెక్ష‌న్స్ ఫేక్ అని.. సొంత రిలీజే కదా ఎంతైనా చెప్పుకోవ‌చ్చని ఇండ‌స్ట్రీ వర్గాల్లో హాట్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. వాస్త‌వానికి 'ఉప్పెన' కార‌ణంగా నిర్మాత‌లు ఎప్పుడో లాభాల్లోకి వెళ్లిపోయారు. కానీ మైత్రీ వారు ఈ సినిమాకు ఇంత హైప్ తీసుకురావడానికి ట్రై చేయడానికి కార‌ణం సుకుమార్ మాత్ర‌మే అని అంటున్నారు.

సుక్కూ ఏ రోజైతే ఈ సినిమా వంద కోట్లు వసూలు చేస్తుందని స్టేట్మెంట్ ఇచ్చాడో.. ఆ రోజు నుంచి 'ఉప్పెన' టీమ్ 100 కోట్లు పోస్టర్ రెడీ చేసి పెట్టుకుందట. ఇక తాను చెప్పిన మాట‌ని నిరూపించ‌డానికి సుక్కు కూడా తెగ ట్రై చేస్తున్నాడని తెలుస్తోంది. తాను డైరెక్ట్ చేసిన సినిమాల‌కే ప్ర‌మోష‌న్స్ పెద్దగా చేయని సుకుమార్.. ఇప్పుడు 'ఉప్పెన' కోసం ఏకంగా రియాల్టీ గేమ్ షోస్ లో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఈ సినిమాను ప్ర‌మోట్ చేస్తుండ‌టం విశేషమని ఫిలిం సర్కిల్స్ లో కామెంట్స్ వినిపిస్తున్నాయి.