Begin typing your search above and press return to search.

టికెట్‌ అమ్మేసి ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేస్తున్నారు

By:  Tupaki Desk   |   9 July 2015 3:49 PM IST
టికెట్‌ అమ్మేసి ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేస్తున్నారు
X
ప్రస్తుతం ఊరూ వాడా బాహుబలి మానియా సాగుతోంది. సరిగ్గా ఇదే అదనుగా ఫేక్‌ టికెటింగ్‌ రాకెట్‌ ఒకటి బైటికొచ్చి నిర్ఘాంతపోయే నిజాల్ని బైటికి తెచ్చింది. బాహుబలి టిక్కెట్ల విషయంలో ఘరానా మోసం వెలుగు చూసింది. బాహుబలి మానియాని క్యాష్‌ చేసుకునేందుకు కొందరు పన్నిన పన్నాగంలో అమాయకులు జేబులు గుల్ల చేసుకుంటున్నట్టు తెలిసింది.

సదరు టిక్కెట్‌ సెల్లర్‌ ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ వంటి ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ని వేదికగా చేసుకుని టిక్కెట్ల క్రయవిక్రయాలు సాగిస్తున్నారు. రూ.1000కే బాహుబలి టిక్కెట్‌ అంటూ ఊరించి అమ్మేస్తున్నారు. గ్రూప్‌గా కొనుక్కుంటే కేవలం రూ.500కే టిక్కెట్‌ అంటూ ఊరిస్తున్నారు. తీరా ఆ టిక్కెట్లు కొనుక్కున్న వాళ్లంతా అవి ఫేక్‌ టిక్కెట్లు కావడంతో ఒక్కసారిగా మోసపోయామని తెలుసుకుంటున్నారు. అయితే ఈలోగానే అమ్మకాలు పూర్తి చేసుకుని, ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేస్తున్నారు.

ఇప్పటికే ఇలా ఎందరో మోసపోయారు. ఈ ఫేస్‌బుక్‌ టిక్కెట్లను నమ్మొద్దు. సదరు టిక్కెట్టు అమ్మే వ్యక్తులు అమ్మకాలు పూర్తయ్యాక ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేస్తున్నారు. అసలు ఆ టిక్కెట్లు ఎవరు అమ్ముతున్నారు? ఎవరు ఫస్ట్‌ పర్సన్‌? ఎవరు తర్వాతి పర్సన్‌? ఎలా వస్తున్నాయి? లాంటి వివరాలేవీ అడక్కుండా అడ్డంగా బుక్కయిపోయినవాళ్లెందరో. కబడ్ధార్‌ ఇదో ఘరానా మోసం. ఆన్‌లైన్‌ పంచ్‌!