Begin typing your search above and press return to search.

మణిరత్నంకు మళ్లీ అదే కష్టమా?

By:  Tupaki Desk   |   8 Feb 2018 4:32 AM GMT
మణిరత్నంకు మళ్లీ అదే కష్టమా?
X
ఒకప్పుడు మణిరత్నం సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు.. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేది. కానీ ఆయన అప్పటి ఫార్మాట్ నే ఎక్కువగా చూపించి ఇప్పుడు రొటీన్ అయ్యేలా చేశాడు. దీంతో డిజాస్టర్స్ తిప్పలు తప్పడం లేదు. ప్రస్తుతం ఆయన సినిమా మొదలు పెడితే అసలు ఎప్పుడు ఎండ్ అవుతుందో తెలియని పరిస్థితి. అలాగే క్యాస్టింగ్ గురించి మొదట హైప్ ని ఓ రేంజ్ లో క్రియేట్ చేసే మణి ఆ తరువాత ఎవరు ఊహించని విధంగా మార్చేస్తుంటారు.

ఆయన వల్ల అవుతుందో లేక ఇతర కారణం వల్లనో తెలియదు గాని సినిమాలో క్యాస్టింగ్ చేంజ్ మాత్రం ఏ మాత్రం ఆగడం లేదు. గతంలో రామ్ చరణ్ - నాని - మహేష్ బాబు వంటి స్టార్ హీరోలతో సినిమా చేయాలని ఈ దర్శకుడు అనుకున్నాడు. వారు కూడా దాదాపు ఒకే అనేశారు. కానీ మళ్లీ ఏమైందో ఏమో గాని వేరే యాక్టర్స్ ని తీసుకు వస్తున్నాడు. ఇక గత కొంత కాలంగా ఓ బిగ్ మల్టి స్టారర్ పై కన్నేసిన మణిరత్నం ఇంకా ఆ సినిమాను పట్టాలెక్కించలేకపోతున్నాడు.

ఆ ప్రాజెక్ట్ లో ఫహద్ ఫజిల్ - శింబు - విజయ్ సేతుపతి - అరవింద్ స్వామి - జ్యోతిక - ఐశ్వర్య రాజేష్ - అదితి రావు ప్రధాన పాత్రలు పోషించనున్నారు. అయితే సినిమా ఆలస్యం అవుతుండడంతో ఫహద్ ఫజిల్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇంకా అధికారికంగా ఈ న్యూస్ తెలియలేదు కానీ అతను సినిమాలో నటించడానికి సిద్ధంగా లేడని ప్రస్తుతం టాక్ వినిపిస్తోంది. మరి ఆ హీరో ప్లేస్ లో మణిరత్నం ఇంకెవరిని తీసుకుంటాడో చూడాలి.