Begin typing your search above and press return to search.

పుష్ప మేకర్స్‌ పై ఆ స్టార్‌ ఫ్యాన్స్ దాడి తప్పదేమో!

By:  Tupaki Desk   |   27 Jun 2021 10:30 AM GMT
పుష్ప మేకర్స్‌ పై ఆ స్టార్‌ ఫ్యాన్స్ దాడి తప్పదేమో!
X
ఏదైనా సినిమాలో తమ అభిమాన హీరో నటిస్తున్నప్పుడు ఆ సినిమా కోసం ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇంట్రెస్ట్‌ గా ఎదురు చూసిన సమయంలో ఆ సినిమాలో తమ అభిమాన నటుడు కనిపించకుంటే లేదంటే ప్రాధాన్యత లేని పాత్రలో ఉంటే సహిస్తారా.. ఖచ్చితంగా లేదు. అభిమానులు చిత్ర యూనిట్‌ సభ్యులపై ఏదో ఒక మార్గంలో దాడి చేస్తూ ఉంటారు. కొందరు సినిమా పై బ్యాడ్‌ టాక్ క్రియేట్ చేస్తే.. మరి కొందరు సోషల్‌ మీడియాలో తమ అభిమాన హీరో కు అవమానం జరిగిందని ఆ సినిమా పై విమర్శలు చేయడం చేస్తారు. ఇప్పుడు పుష్పకు కూడా అలాంటి ట్రోల్స్‌ తప్పవేమో అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

విషయానికి వస్తే అల్లు అర్జున్‌.. సుకుమార్ ల కాంబోలో రూపొందుతున్న పుష్ప సినిమా లో కీలక పాత్రలో ఫాహద్ ఫాజిల్ నటిస్తున్న విషయం తెల్సిందే. మలయాళంలోనే కాకుండా అన్ని భాషల్లో కూడా ఆయనకు అభిమానులు ఉన్నారు. వారు ఇప్పుడు పుష్ప సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు పుష్ప వస్తుంది.. ఫాహద్ ను నెగటివ్‌ షేడ్స్ లో చూస్తామా అంటూ ఎదురు చూస్తున్న వారికి ముందే పుష్ప 1 లో ఫాహద్‌ పాత్ర తక్కువ ఉంటుందని హింట్‌ ఇస్తున్నారు.

పుష్ప సినిమా విడుదలై ఫాహద్ కోసం సినిమా చూసేందుకు వెళ్లే వారికి నిరాశ కలిగించవద్దనే ఉద్దేశ్యంతో ముందు నుండే చెబుతున్నారని టాక్‌. ఇప్పుడే లీక్ చేసినా కూడా పుష్ప 1 లో ప్రస్తుతం టాలీవుడ్‌ లో జరుగుతున్న ప్రచారం ప్రకారం మూడు సీన్స్ లో మాత్రమే ఆయన కనిపిస్తే అభిమానులు ఖచ్చితంగా ట్రోల్‌ చేయడం ఖాయం అనిపిస్తుంది. ఫాహద్ ఫాజిల్‌ ను వినియోగించుకోలేక పోయాడు అంటూ సుకుమార్‌ పై కామెంట్స్‌ చేయడంతో పాటు ఇతర యూనిట్‌ సభ్యులకు నెట్టింట దాడి తప్పదంటున్నారు. పుష్ప మొదటి పార్ట్‌ లో కేవలం మూడు సీన్స్ కే పరిమితం కాబోతున్న ఫాహద్ రెండవ పార్ట్‌ లో మాత్రం ఫుల్‌ లెంగ్త్‌ పాత్రలో కనిపించబోతున్నట్లుగా చెబుతున్నారు.