Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ గ్యారేజ్ లో మరో మళయాళ స్టార్

By:  Tupaki Desk   |   30 Dec 2015 11:43 AM GMT
ఎన్టీఆర్ గ్యారేజ్ లో మరో మళయాళ స్టార్
X
ప్రస్తుతం నాన్నకు ప్రేమతో చిత్రాన్ని ఫినిష్ చేస్తున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. సంక్రాంతికి ఈ చిత్రాన్ని ఫినిష్ చేసి, ప్రమోషన్ కార్యక్రమాలు ఫినిష్ చేసి, జనవరి చివరినాటికి జనతా గ్యారేజ్ స్టార్ట్ చేసేయాలన్నది ఎన్టీఆర్ ఐడియాగా తెలుస్తోంది.

కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ మూవీని.. నవంబర్ లోనే లాంఛనంగా ప్రారంభించారు. ఇక సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్ధమయ్యేందుకు.. ఇతర నటీ నటుల ఎంపిక కూడా పూర్తి చేసేస్తున్నాడు కొరటాల. ఇప్పటికే సమంత - నిత్యామీనన్ లను హీరోయిన్ రోల్స్ కి దాదాపు ఖరారు చేశారు. మరోవైపు.. ఓ కీలక పాత్ర కోసం మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కు దించుతున్నారు. తొలిసారిగా ఓ స్ట్రైట్ టాలీవుడ్ మూవీలో మోహన్ లాల్ ఫుల్ లెంగ్త్ రోల్ పోషిస్తున్నారు. ఈ పాత్ర కోసం తెలుగు కూడా నేర్చేసుకుంటున్నారు ఆయన. జనతా గ్యారేజ్ లో మరో ప్రాధాన్యత గల పాత్ర ఉందని తెలుస్తోంది. దీనికోసం మరో మళయాళ స్టార్ పహద్ ఫాజిల్ ను తెస్తున్నారని తెలుస్తోంది. ఈయన పాత్ర లెంగ్తీ కాకపోయినా.. స్టోరీ పరంగా చాలా కీలకమైనదిగా చెబ్తున్నారు.

అయితే.. ఫాజిల్ నుంచి ఎలాంటి స్పందన వచ్చిందో ఇంకా తెలీదు. ఈ కేరక్టర్ ని పోషించే యాక్టర్ పై.. కొరటాల నుంచి కూడా క్లారిటీ లేదు. కేస్టింగ్ విషయంలో పక్కాగా ఉంటాడని కొరటాలకి నేమ్ ఉంది. ఆయా పాత్రలను నటులను ఎంపిక చేసుకోవడంలోనే.. ఈ దర్శకుడు ట్యాలెంట్ చూపుతాడంతున్నారు. మరిప్పుడు ఇంతమంది టాలీవుడ్ దిగ్గజాలను పక్కన పెట్టుకుని కూడా.. మళయాళ స్టార్లను తీసుకురావడంలో.. వేరే అంతరార్ధం ఉందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.