Begin typing your search above and press return to search.

ఫేడ్‌ ఔట్‌ హీరోయిన్‌ రూ. 3 కోట్లు డిమాండ్‌.. షాక్‌ అయిన నిర్మాత

By:  Tupaki Desk   |   15 May 2020 2:00 PM IST
ఫేడ్‌ ఔట్‌ హీరోయిన్‌ రూ. 3 కోట్లు డిమాండ్‌.. షాక్‌ అయిన నిర్మాత
X
టాలీవుడ్‌ లో ఈ హీరోయిన్‌ కు సుదీర్ఘ కాలంగా స్టార్‌ హీరోయిన్‌ క్రేజ్‌ ఉంది. దాదాపుగా పుష్కర కాలం పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో హాట్‌ హీరోయిన్‌ గా పాత్రలు చేస్తూ.. అప్పుడప్పుడు ఐటెం సాంగ్స్‌ లో కూడా కనిపించిన ఈ అమ్మడు రెండేళ్ల కాలంగా పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. గత ఏడాది రెండు సినిమాలతో మళ్లీ బ్రేక్‌ వచ్చింది. గత ఏడాది వచ్చిన రెండు సినిమాలు మళ్లీ ఈమెను బిజీ అయ్యేలా చేశాయి. ఈ సమయంలోనే ఈమె తన పారితోషికంను భారీగా పెంచింది.

తాజాగా ఒక సినిమా కోసం ఈమెను నిర్మాత కమిట్‌ అవ్వగా ఏకంగా మూడు కోట్లు డిమాండ్‌ చేసిందట. ప్రస్తుతం ఉన్న పూజా హెగ్డే.. రష్మిక మందన్నలు కూడా ఆ స్థాయిలో డిమాండ్‌ చేయడం లేదు.. ఈమె ఈ స్థాయిలో డిమాండ్‌ చేస్తుందేంటో అనుకుని రెండు కోట్ల వరకు ఇచ్చేందుకు ఒప్పుకున్నాడట. కాని ఆమె మూడు కోట్లు ఇస్తేనే చేస్తానంటూ పట్టుబట్టిందట.

ఆ హీరో కూడా ఈమద్య కాలంలో వరుసగా ప్లాప్స్‌ లో ఉన్నాడు. అలాంటి హీరోకు అంత భారీ పారితోషికంతో ఆమెను నటింపజేయడం కరెక్ట్‌ కాదని.. హీరోకు కాస్త అటు ఇటుగా పారితోషికం అడిగిన ఆమెకు నిర్మాత స్వస్థి చెప్పి మరో హీరోయిన్‌ తో చర్చలు జరుపుతున్నాడట. ఈసారి కోటితోనే హీరోయిన్‌ ను ఆ నిర్మాత ఓకే చెయాలని భావిస్తున్నాడట. అయినా ఫేడ్‌ ఔట్‌ అవుతున్న ఈ సమయంలో మూడు కోట్లు డిమాండ్‌ చేయడం ఏంటీ విడ్డూరం కాకుంటే అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు చెవులు కొరుక్కుంటున్నారు.