Begin typing your search above and press return to search.
టాప్ స్టోరి: ఈ భామలు మిస్సింగ్!
By: Tupaki Desk | 31 March 2020 8:00 AM ISTరంగుల ప్రపంచం వింతైనది. అందలం ఎక్కించే వాళ్లకు ఎదురేమీ ఉండదు కానీ.. అధఃపాతాళంలో పడిపోతే మాత్రం ఇక అలాంటి వాళ్లకు అన్నీ ఇన్నీ తంటాలు కావు. అమెరికాలో ఎడ్యుకేషన్ అనో లేక వృత్తి మార్చాననో .. వరుడు దొరికితే పెళ్లాడేసాననో మొత్తానికి తప్పించుకుని తిరగాల్సి వస్తుంది. ఆ కోవకే చెందుతారు ఈ ముద్దుగుమ్మలు. పోరాడాల్సినంత కాలం పోరాటం సాగించారు కానీ.. ఎందుకనో ఉన్నట్టుండి తెర మరుగైపోయారు. ప్రతిభ ఉన్నా.. స్టార్ డమ్ అందుకోలేక .. అదృష్టం కలిసి రాక పరిశ్రమను వదిలేసిన భామల జాబితా తిరగేస్తే ఓ డజను మంది పైగానే కనిపిస్తున్నారు.
అందాల రిచా గంగోపాధ్యాయ 2010 లో `లీడర్` చిత్రంతో తొలిసారిగా అందరినీ ఆకర్షించింది. మిరాపాకాయ్- నాగవల్లి- సారొచ్చారు- మిర్చి - భాయ్ చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత ఆమె చదువు కొనసాగించడానికి యుఎస్ కు వెళ్లి పరిశ్రమ నుండి అదృశ్యమైంది. లీడర్ తో అరంగేట్రం చేసిన ప్రియా ఆనంద్ కూడా ఒక జాడ లేకుండా అదృశ్యమైంది. 2010 లో దిల్లీ అందం దీక్ష సేథ్ వేదం చిత్రంతో తొలిసారిగా అడుగుపెట్టింది. మిరాపాకాయ- వాంటెడ్- నిప్పు- ఊ కొడతారా ఉలిక్కి పడతారా- రెబెల్ చిత్రాల్లో నటించింది. అయితే ఆ చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లు అయ్యాయి. అటుపై హిందీ పరిశ్రమపై దృష్టి పెట్టింది. హిందీలో 2016 లో ఆమె `సాథ్ కదమ్` చిత్రం విడుదలైనా బాక్సాఫీస్ వద్ద అది కూడా విఫలమైంది. ప్రస్తుతం ఎటువంటి ఆఫర్లు లేవు.
జబల్పూర్ అందం ప్రగ్యా జైస్వాల్ 2014 లో తెలుగు .. తమిళంలో `డేగ` చిత్రంతో ఏకకాలంలో అడుగుపెట్టింది. క్రిష్ తెరకెక్కించిన `కంచె` చిత్రంలో వరుణ్ తేజ్ సరసన నటించింది. ఓం నామో వెంకటేశాయ- గుంటురోడు- నక్షత్రం చిత్రాల్లో నటించింది. కానీ ఆ చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాపయ్యాయి. ఆచారి అమెరికా యాత్ర 2018 లో నటించి తెరమరుగైంది.
ముంబై అందం నందిత 2012 లో `నీకు నాకు డాష్ డాష్` చిత్రంతో తెలుగులో అడుగుపెట్టింది. ఆమె ప్రేమ కథా చిత్రంతో అందరినీ ఆకర్షించి వరుసగా లవర్స్- కృష్ణమ్మ కలిపిండి ఇద్దరిని- రామిల్లా - శంకరభరణం- సావిత్రి- విశ్వమిత్ర వంటి చిత్రాల్లో నటించింది. కానీ ఇవేవీ తనకు కలిసి రాలేదు. ప్రస్తుతం కెరీర్ జీరో అయ్యింది. ఇంగ్లాండ్ హాటీ నికేషా పటేల్ 2010 లో పులిలో పవన్ కళ్యాణ్ సరసన నటించింది. ఓమ్ 3డి- అరకు రోడ్ లో -గుంటూరు టాకీస్ 2 చిత్రాల్లో నటించింది. కానీ ఇవేవీ కలిసి రాక.. కోలీవుడ్ కి వెళ్లింది. అక్కడ కెరీర్ ఓకే అనిపించింది.
డెహ్రాడూన్ బ్యూటీ సాక్షి చౌదరి 2013 లో పోటుగాడులో మంచు మనోజ్ సరసన రొమాన్స్ చేసింది. జేమ్స్ బాండ్- సెల్ఫీ రాజా- ఆక్సిజన్ -సువర్ణ చిత్రాల్లో ఆమె గ్లామర్ తో మెరిసింది. అన్ని సినిమాలు విఫలమైనందున కెరీర్ పరంగా జీరో అయిపోయింది. ముంబై బ్యూటీ శ్వేతా బసు ప్రసాద్ 2009 లో `కొత్త బంగారు లోకం` చిత్రంలో నటించి ఆరంభమే సంచలనం సృష్టించింది. కాస్కో- రైడ్- కలవర్ కింగ్- నువ్వెక్కడుంటే నేనక్కడుంట.. చిత్రాల్లో నటించింది. కానీ సరైన హిట్ సాధించలేకపోయింది. ఆమె వ్యభిచారంలో పట్టుబడిందన్న ఆరోపణలను ఎదుర్కొంది. అటుపై బాలీవుడ్ లో రెండు సినిమాలు చేసింది. ఇటీవల `ది తాష్కెంట్ ఫైల్స్` చిత్రంలో కనిపించింది. కానీ ఇప్పుడు అసలు ఆఫర్లు లేవు.
శ్రీదివ్య బస్ స్టాప్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చి అందరి హృదయాలను దొంగిలించింది. కెరింత- మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు` చిత్రంలో నటించింది. కానీ తెలుగమ్మాయి కావడంతో ఎలాంటి ఆఫర్లు రాలేదు. ఆమె కోలీవుడ్ లో నటించింది. ఇతర భాషల్లోనూ ప్రయత్నించినా ఎందుకనో పెద్దగా కెరీర్ పరంగా దూసుకెళ్లలేకపోయింది. ఇలా ఎందరో భామలు తెరమరుగైన సంగతి తెలిసిందే.