Begin typing your search above and press return to search.
హాసిని లైఫ్ టాప్ సీక్రెట్స్ లీక్
By: Tupaki Desk | 5 July 2019 1:30 AM GMT`బొమ్మరిల్లు` సినిమాతో హాసినినిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది జెనీలియా. ఈ మరాఠీ చిన్నదాని లైఫ్‌లో తెలుగు ప్రేక్షకులకు తెలియని చాలా సంగతలు సీక్రెట్స్‌గానే వుండిపోయాయి. అవి ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. జెనీలియా నటించిన `జానేతు యా జానేనా` సినిమా విడుదలై సరిగ్గా 11 ఏళ్లు పూర్తియిన సందర్భంగా ఓ బాలీవుడ్ మీడియా జెనీలియాకు సంబంధించిన ఆసక్తికర విషయాల్ని వెల్లడించింది. 1987 ఆగస్టు 5న ముంబైలో పుట్టిన అసలు సిసలు మరాఠీ క్రిస్టియన్. బాంద్రాలోని అపోస్టోలిక్ కార్మెల్ హైస్కూల్లో తన స్కూలింగ్ పూర్తయింది. ఆ తరువాత సేయింట్ ఆండ్రూస్ డిగ్రీ కాలేజీలో మేనేజ్మెంట్ స్టడీస్‌లో డిగ్రీ పూర్తి చేసింది.
ఆ తరువాతే రితేష్ దేశ్ముఖ్తో కలిసి `తుజే మేరీ కసమ్` సినిమాలో నటించింది. ఓ ఎమ్మెన్సీలో జాబ్ చేయాలనుకున్న జెనీలియా జీవితం `తుజే మేరీ కసమ్` ఆఫర్ తో మరో టర్న్ తీసుకుంది. జెనీలియా సినిమాల్లోకి రాకుంటే నేషనల్ గేమ్ ఫుట్ బాల్లో ఇండియా తరుపున ఆడి వుండేది. అప్పట్లో రాష్ట్ర స్థాయి అథ్లెట్‌గా, స్ప్రింటర్‌గా.. జాతీయ స్థాయిలో ఫుట్ బాల్ ప్లేయర్‌గా రాణించింది. 15 ఏళ్ల వయసులోనే మోడల్‌గా తెరంగేట్రం చేసిన జెనీలియా అతి తక్కువ సమయంలోనే బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ తో కలిసి పాపులర్ పార్కర్ పెన్ యాడ్ లో నటించి ఆశ్చర్యపరిచింది. `తుజే మేరీ కసమ్` సినిమా సమయంలోనే రితేష్ దేశ్ముఖ్తో జెనీలియాకు మంచి అనుబంధం ఏర్పడిందట. ఈ విషయాన్ని స్వయంగా రితేష్ వెల్లడించాడు. ``తుజే మేరీ కసమ్` సినిమా చిత్రీకరణ సమయంలో జెనీలియా తనతో మూడు రోజుల పాటు మాట్లాడలేదని.. రితేష్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకని తన దగ్గరికి వస్తే చుట్టూ సెక్యురిటీ వుంటుందని భావించేదట.
ఒక రోజు ఆ హడావిడీ ఏమీ కనిపించకపోవడంతో నీకు సెక్యురిటీ లేదే అని అడిగేసిందట. అప్పటి నుంచే ఇద్దరి మధ్య అనుబంధం చిగురించడం మొదలైందని, తాను తన ఇంటికి తీసుకుకెళ్లి పరిచయం చేసిన తొలి నటి కూడా జెనీలియానే అని రితేష్ అసలు విషయం చెప్పేశాడు. అన్నట్టు రితేష్‌దేశ్‌ముఖ్, జెనీలియా 2012లో వివాహం చేసుకున్నారు. ఇప్పుడు వారికి ఇద్దరు పిల్లలు.