Begin typing your search above and press return to search.

రాజు గారు కతను భలే పట్టేశారే!!

By:  Tupaki Desk   |   21 Nov 2016 10:30 PM GMT
రాజు గారు కతను భలే పట్టేశారే!!
X
ఎం.ఎస్.రాజు.. ఇప్పుడొక శృంగార భరితమైన చిత్రం తీస్తున్నాడని ఆల్రెడీ చెప్పుకున్నాం. ''రతి'' అనే టైటిల్ తో రూపొందే ఈ సినిమాలో హీరో ఎవరు హీరోయిన్స్ ఎవరు అనే విషయాలు పెడితే.. ఇప్పుడు ఈ సినిమా కత గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలుస్తోంది. లెటజ్ సీ.

నిజానికి ఏ దర్శకుడు వచ్చి సుమంత్ అశ్విన్ తో సినిమాను చేయాలని అనుకున్నా కూడా.. వాళ్లు ముందు ఎం.ఎస్.రాజు కు కథ వినిపించాల్సిందే. ఆయనకు నచ్చితేనే అది సుమంత్ చేస్తాడు. అయితే ఈ మద్యన అలాగే వచ్చిన ఒక షార్ట్ ఫిలిం దర్శకుడు.. తను డెబ్యూ చేయడానికి ఒక ఎడల్ట్ కామెడీ కతను రాజు గారికి వినిపించాడట. అది నచ్చిన రాజుగారు వెంటనే ఆ కథను కొనేసుకుని.. అతనికి వేరే సినిమా డైరక్టర్ గా అవకాశం ఇస్తానని చెప్పి.. ఈ కథను ఈయనే తెరకెక్కించాలని ఫిక్సయ్యాడట. అందుకే ఆ విధంగా ఆయన దర్శకత్వంలో ''రతి'' రూపొందుతోంది అంటున్నారు సన్నిహితులు.

సర్లేండి సారూ.. ఈ సినిమాలో ఒకవేళ హీరోలెవ్వరూ ఖాళీగా లేరని సుమంత్ అశ్విన్ నే పెట్టేరు.. అనవసరంగా మనోడి కెరియర్ కు కాస్త పంచ్ పడే ఛాన్సుంది. అయినా ఒక ప్రక్కన శ్రీనివాస్ అవసరాల ''హంటర్'' అనే సెక్స్ కామెడీ రీమేక్ చేస్తున్నప్పుడు.. ఇప్పుడు అదే జానర్లో ఈయన ''రతి'' చేయడమేంటో!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/