Begin typing your search above and press return to search.

ఫోటోటాక్ : పిచెక్కించిన ఫ్యాన్‌ మేడ్‌ పోస్టర్‌

By:  Tupaki Desk   |   30 March 2020 4:30 PM GMT
ఫోటోటాక్ : పిచెక్కించిన ఫ్యాన్‌ మేడ్‌ పోస్టర్‌
X
అల్లు అర్జున్‌ ఈ ఏడాది అల వైకుంఠపురంలో చిత్రంతో ఇండస్ట్రీ హిట్‌ దక్కించుకున్నాడు. కెరీర్‌ లో బిగ్గెస్ట్‌ సక్సెస్‌ ను దక్కించుకున్న బన్నీ తదుపరి చిత్రం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. సుకుమార్‌ దర్శకత్వంలో బన్నీ తదుపరి చిత్రం ఉండబోతుంది. లారీ డ్రైవర్‌ గా బన్నీ కనిపించబోతున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. షూటింగ్‌ ఇప్పటికే మొదలు కావాల్సి ఉండగా కరోనా కారణంగా షూటింగ్‌ కు బ్రేక్‌ పడినది. ఈ సమయంలోనే బన్నీ సుకుమార్‌ ల మూవీ ఫస్ట్‌ లుక్‌ అంటూ ఈ పోస్టర్‌ సోషల్‌ మీడియా లో ప్రత్యక్ష్యం అయ్యింది.

గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లుగా బన్నీ లుక్‌ ఉండటం తో అంతా కూడా నిజంగానే ఇది అఫిషియల్‌ లుక్‌ అనుకుంటున్నారు. బన్నీ మాస్‌ లుక్‌ లో అదిరి పోయాడని.. రంగస్థలం చిత్రంలో చరణ్‌ లుక్‌ ను మించి బన్నీ లుక్‌ ఉంది అంటూ ప్రశంసలు కురిపించారు. అయితే అసలు విషయం ఏంటీ అంటే అది ఒక ఫ్యాన్‌ చేసిన పోస్టర్‌. బన్నీ ఫ్యాన్‌ ఒకరు సరదాగా ఆ పోస్టర్‌ ను డిజైన్‌ చేసినట్లుగా తెలుస్తోంది.

ఆ ఫ్యాన్‌ మేడ్‌ పోస్టర్‌ తో ఫ్యాన్స్‌ కు పిచెక్కి పోయింది. బన్నీని ఇలాగే చూడాలనుకుంటున్నాం అంటూ సుకుమార్‌ కు ఆ పోస్టర్‌ ను చాలా మంది పంపిస్తూ కామెంట్స్‌ చేస్తున్నారు. బన్నీని ఆయన 20వ చిత్రంలో ఇలా చూపించండి ప్లీజ్‌ అంటూ ఫ్యాన్స్‌ సుకుమార్‌ ను రిక్వెస్ట్‌ చేస్తున్నారు. మొత్తానికి ఫ్యాన్‌ మేడ్‌ బన్నీ 20 మూవీ పోస్టర్‌ సోషల్‌ మీడియాను ఒక కుదుపు కుదిపేసింది. ఈ పోస్టర్‌ పై బన్నీ కాని సుకుమార్‌ కాని స్పందిస్తే బాగుంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.