Begin typing your search above and press return to search.

అంతరిక్షంలో విధ్వంసం.. దుమ్ములేపుతున్న ‘F9’ ట్రైల‌ర్!

By:  Tupaki Desk   |   15 April 2021 12:43 PM IST
అంతరిక్షంలో విధ్వంసం.. దుమ్ములేపుతున్న ‘F9’ ట్రైల‌ర్!
X
ప్రేమ కథలకు, రొమాన్స్ సినిమాలకే కాదు.. యాక్షన్ సినిమాలకూ భారీ స్థాయిలో అభిమానులు ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్ష‌కుల్లో వీరి వాటా గ‌ణ‌నీయంగానే ఉంటుంది. అందుకే.. వీరిని టార్గెట్ చేసుకొని యాక్ష‌న్ సినిమాలు తెర‌కెక్కుతుంటాయి. కంటెంట్ ఉండాలేగానీ.. అద్భుతమైన విజ‌యాలు కూడా న‌మోదు చేస్తుంటాయి. అలాంటి స‌క్సెఫుల్ యాక్ష‌న్ మూవీస్ లో ఒక‌టి ‘ఫాస్ట్ అండ్ ప్యూరియ‌స్‌’.

ఇప్ప‌టి వ‌ర‌కూ వ‌చ్చిన ఎనిమిది సిరీస్ లు కూడా అద్భుతంగా ఆక‌ట్టుకున్నాయి. ఇప్పుడు 9వ చిత్రం రాబోతోంది. ‘F9’ టైటిల్ తో రాబోతున్న ఈ చిత్రం కోసం వ‌ర‌ల్డ్ వైడ్ గా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ స‌మ్మ‌ర్ లో థియేట‌ర్ల‌ను తాక‌నున్న ‘F9’ సునామీకి సంబంధించిన శాంపిల్‌.. లేటెస్ట్ గా రిలీజ్ అయ్యింది.

తాజాగా వ‌చ్చిన ఈ సినిమా ట్రైల‌ర్ అభిమానుల‌ను విశేషంగా అల‌రిస్తోంది. అయితే.. ఇందులో స్పెషాలిటీ ఏమంటే.. ఇప్ప‌టి వ‌ర‌కూ యాక్ష‌న్ సన్నివేశాలు భూమ్మీద‌నే కొన‌సాగ‌గా.. ఈ సారి ఆకాశంలో విధ్వంసం కొన‌సాగ‌నున్న‌ట్టు ట్రైల‌ర్ హింట్ ఇస్తోంది. గ‌తంలో డైరెక్ట‌ర్ జ‌స్టిన్ లిన్ కూడా.. అంత‌రిక్షానికి సంబంధించిన స‌న్నివేశాలు ఉంటాయ‌ని చెప్పారు. దీంతో.. అవి ఏ రేంజ్ లో ఉంటాయో చూడాల‌నే క్యూరియాసిటీ ఫ్యాన్స్ లో పెరిగిపోతోంది.