Begin typing your search above and press return to search.

న్యూ షెడ్యూల్ ఖరారు చేసిన ఎఫ్3 బృందం..!

By:  Tupaki Desk   |   13 April 2021 3:30 PM GMT
న్యూ షెడ్యూల్ ఖరారు చేసిన ఎఫ్3 బృందం..!
X
టాలీవుడ్ హీరోలు విక్టరీ వెంకటేష్, మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలు తెరకెక్కుతున్న మల్టీస్టారర్ ఫిల్మ్ 'ఎఫ్3'. డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఎఫ్2 పంథాలోనే తెరకెక్కుతోంది. అందాల భామలు తమన్నా, మెహరీన్ లీడ్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. ఇటీవలే ఎఫ్3 బృందంలో హీరోయిన్ అంజలి చేరింది. ఇప్పటికే పలు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఎఫ్3 మూవీ.. ఇక బ్రేక్ లేకుండా షూటింగ్ చేసే ఆలోచనలో ఉందట. ఇదివరకు వెంకటేష్ దృశ్యం-2 సినిమా కోసం బ్రేక్ తీసుకున్నాడట. ఇన్నిరోజుల తర్వాత మళ్లీ ఆయన తదుపరి షెడ్యూల్లో జాయిన్ అవ్వనున్నాడు. కరోనా కారణంగా ప్రస్తుతం సినిమా విడుదలలు నిలిచిపోతున్నాయి.

పలు సినిమాలు షూటింగ్స్ నిలుపుకున్నాయి. కానీ ఎఫ్3 బృందం మాత్రం పక్కా రిలీజ్ డేట్ కు ఎలాగైనా సినిమాను అందించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇదివరకే ఎఫ్3 సినిమాను ఆగష్టు 27న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఇటీవలే ఆయన వకీల్ సాబ్ బ్లాక్ బస్టర్ తో పట్టలేని ఆనందంలో ఉన్నాడు. అందుకే తదుపరి సినిమాలను కూడా చకచకా లైన్ లో పెడుతున్నాడు. ఎఫ్3 సినిమా న్యూ షెడ్యూల్ మైసూర్ లో ఖరారు చేశారట. తాజాగా ఈ చిత్రబృందం మైసూర్ బయలుదేరే సమయం ఆసన్నమైందట. ఎందుకంటే తాజా సమాచారం ప్రకారం.. ఎఫ్3 న్యూ షెడ్యూల్ ఏప్రిల్ 15న ప్రారంభం చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ షెడ్యూల్లోనే సినిమాను మాక్సిమం కంప్లీట్ చేయాలనీ అనుకుంటున్నారట.