Begin typing your search above and press return to search.

ఎఫ్3 సెకండ్‌ సింగల్‌... ఇంట్రెస్టింగ్‌ అప్డేట్

By:  Tupaki Desk   |   18 April 2022 6:17 AM GMT
ఎఫ్3 సెకండ్‌ సింగల్‌... ఇంట్రెస్టింగ్‌ అప్డేట్
X
వెంకటేష్‌.. వరుణ్‌ తేజ్‌ హీరోలుగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ఎఫ్ 3'. ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ప్రస్తుతం ఐటెం సాంగ్ చిత్రీకరణ జరుపుతున్నారు. త్వరలోనే ఆ ఐటెం సాంగ్ కూడా ముగుస్తుంది. ఇక సినిమాను మే నెలలో సినిమాను విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే సినిమా విడుదల తేదీని ప్రకటించారు.

ఎఫ్‌ 3 సినిమా నుండి ఇప్పటికే మొదటి పాట వచ్చింది. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న ఈ సమయంలో మరో పాటను విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఎఫ్ 3 సినిమా నుండి హూ ఆ ఆహా ఆహా... అనే పాట ను విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.

సినిమా లో చాలా ఆసక్తికరంగా సాగే సన్నివేశంలో ఈ పాట ఉంటుందని అంటున్నారు. సినిమా కు దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందించిన విషయం తెల్సిందే.

ఇప్పటికే వచ్చిన దేవి శ్రీ ప్రసాద్ రీసెంట్ ఆల్బం లు అన్ని కూడా మంచి విజయాలను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. కనుక ఎఫ్‌ 3 సినిమా నుండి రాబోతున్న రెండవ పాట కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది.

మే 27వ తారీకున విడుదల కాబోతున్న ఈ సినిమా ఎఫ్ 2 కంటే ఘన విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనే నమ్మకంతో ప్రతి ఒక్కరు ఉన్నారు. ఎఫ్2 సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఎఫ్ 3 సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

దర్శకుడు అనీల్‌ రావిపూడి ఇప్పటి వరకు అపజయం ఎరగలేదు. కనుక ఎఫ్ 3 సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. గత చిత్రం సరిలేరు నీకెవ్వరు కూడా మంచి విజయాన్ని సొంతం కావడంతో తప్పకుండా ఎఫ్ 3 విజయాన్ని సొంతం చేసుకోవడం నూరు శాతం కన్ఫర్మ్‌ అంటూ అభిమానులు నమ్మకంతో ఉన్నారు.