Begin typing your search above and press return to search.

ఎఫ్‌3లోని ఆ సన్నివేశాలన్నీ పూర్తి!

By:  Tupaki Desk   |   6 April 2021 7:17 AM GMT
ఎఫ్‌3లోని ఆ సన్నివేశాలన్నీ పూర్తి!
X
వెంకటేష్‌ మరియు వరుణ్‌ తేజ్‌ లు కలిసి నటిస్తున్న 'ఎఫ్‌ 3' సినిమా షూటింగ్‌ మేజర్‌ పార్ట్‌ పూర్తి చేసుకున్నట్లుగా సమాచారం అందుతోంది. ప్రస్తుతం వెంకటేష్‌ దృశ్యం 2 సినిమా షూటింగ్‌ లో పాల్గొంటున్న విషయం తెల్సిందే. మరో వైపు ఎఫ్‌ 3 షూటింగ్‌ ను వరుణ్‌ తేజ్‌ తో దర్శకుడు అనీల్‌ రావిపూడి కానిచ్చేస్తున్నాడు. చిత్ర యూనిట్‌ సభ్యుల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఎఫ్‌ 3 లోని వెంకటేష్‌ మరియు వరుణ్‌ తేజ్ ల కాంబో సన్నివేశాలు దాదాపుగా పూర్తి అయ్యాయట. వీరిద్దరు కలిసి అయిదు నుండి ఏడు రోజుల పాటు షూటింగ్ లో పాల్గొంటే సరి పోతుందట. కాంబో సీన్స్‌ పూర్తి అవ్వడంతో మెల్లగా హీరోలు విడి విడిగా షూటింగ్‌ చేస్తున్నారట.

ప్రస్తుతం వరుణ్ తేజ్ తో షూట్‌ చేస్తున్న దర్శకుడు త్వరలో వెంకటేష్‌ సోలో సన్నివేశాలను చిత్రీకరించబోతున్నాడట. వరుణ్‌ తేజ్‌ మరియు మెహ్రీన్‌ లపై పాట కూడా చిత్రీకరిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. దృశ్యం 2 ను ముగించుకుని వచ్చిన తర్వాత వెంకటేష్‌ మరియు తమన్నాలపై కీలక సన్నివేశాల చిత్రీకరణ ప్రారంభించబోతున్నట్లుగా యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. మొత్తానికి ఎఫ్‌ 3 సినిమా అనుకున్న సమయం కంటే చాలా ముందే షూటింగ్‌ పూర్తి చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సినిమా ను ఆగస్టులో విడుదల చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. సినిమా షూటింగ్‌ స్టేటస్‌ చూస్తుంటే మే లేదా జూన్‌ లోనే సినిమా కు గుమ్మడి కాయ కొట్టేలా ఉన్నారు.

ఎఫ్‌ 2 సినిమా లో వెంకీ మరియు వరుణ్‌ లు భార్య ప్రియురాలుతో ఇబ్బంది పడ్డ సన్నివేశాలను ఫన్నీగా చూపించడం జరిగింది. ఎఫ్‌ 3 లో వరుణ్‌ మరియు వెంకీలు డబ్బు సంపాదించడం కోసం పడే కష్టాలను ఫన్నీగా చూపించబోతున్నట్లుగా చెబుతున్నారు. మొత్తానికి ఈ సినిమా ఎఫ్‌ 2 ను మించిన ఎంటర్‌ టైన్‌ మెంట్‌ ను అందిస్తుందని అంటున్నారు. ఎఫ్‌ 3 కి అదనంగా సునీల్‌ మరియు వెన్నెల కిషోర్‌ లు యాడ్ అవుతున్నారు. వీరిద్దరి కామెడీతో సినిమా రేంజ్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు.