Begin typing your search above and press return to search.

ఎఫ్‌ 3 ఫన్‌ లబ్ డబ్ లబ్‌ డబ్‌ తో షురూ

By:  Tupaki Desk   |   3 Feb 2022 6:30 AM GMT
ఎఫ్‌ 3 ఫన్‌ లబ్ డబ్ లబ్‌ డబ్‌ తో షురూ
X
వెంకటేష్‌.. వరుణ్‌ తేజ్ లు హీరోలుగా తమన్నా మరియు మెహ్రీన్ లు హీరోయిన్స్ గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఎఫ్‌ 2 సినిమా 2019 సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా కు సీక్వెల్‌ గా వెంటనే ఎఫ్‌ 3 ని ప్రకటించినా కూడా కరోనా వల్ల ఆలస్యం అయ్యింది. గత ఏడాది లోనే విడుదల అవ్వాల్సిన ఎఫ్‌ 3 సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఎట్టకేలకు విడుదలకు సిద్దం అయ్యింది. ఏప్రిల్‌ 28న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నుండి మొదటి పాటను విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. మొదటి నుండి కూడా ఈ సినిమా కథ డబ్బు కు సంబంధించిన విషయాల చుట్టూ తిరుగుతుంది అని చెబుతూ వస్తున్నారు.

డబ్బు థీమ్ తో ఎంటర్‌ టైన్ చేయబోతున్న ఎఫ్‌ 3 సినిమా మొదటి పాట ను కూడా అదే థీమ్‌ తో విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. లబ్‌ డబ్‌ లబ్‌ డబ్‌ డబ్బూ... అంటూ సాగే పాటను ఫిబ్రవరి 7వ తారీకున విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. రూపాయి కాయిన్‌ మరియు నోట్ల కట్ల బ్యాక్ డ్రాప్‌ తో వరుణ్‌ తేజ్ మరియు వెంకటేష్ లు అయ్య గార్ల గెటప్ లో మొదటి పాట ప్రకటన పోస్టర్ లో కనిపించారు. డబ్బు సంపాదన కోసం వీరిద్దరు పడే కష్టాలను చాలా ఫన్నీగా చూపించబోతున్నట్లుగా మేకర్స్ చెబుతున్నారు. కనుక మొదటి పాటను ఆ థీమ్‌ తోనే విడుదల చేయడం వల్ల సినిమాపై మరింత ఆసక్తి మరియు అంచనాలు పెంచే అవకాశం ఉంటుందని మేకర్స్ భావించినట్లుగా ఉన్నారు.

వెంకటేష్ మరియు వరుణ్‌ తేజ్ లు మొదటి పార్ట్‌ లో తోడల్లుళ్లు గా కనిపించారు. తమన్నా మరియు మెహ్రీన్‌ లు అక్క చెల్లిగా కనిపించారు. ఈ సినిమాలో ఇద్దరు ఎలా కనిపిస్తారు అనేది చూడాలి. ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణగా కమెడియన్‌ కమ్‌ హీరో సునీల్‌ నిలువబోతున్నట్లుగా మేకర్స్ అంటున్నారు. ఎఫ్ 2 సినిమా లో వెంకటేష్ మరియు వరుణ్‌ తేజ్ తో పాటు రాజేంద్ర ప్రసాద్‌ కామెడీ పండించాడు. ఇప్పుడు ఈ ముగ్గురితో పాటు సునీల్‌ కూడా జత చేరడం వల్ల ఖచ్చితంగా ఎంటర్ టైన్‌మెంట్‌ డబుల్‌ అవుతుందని నెటిజన్స్ మరియు సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవలే ఎఫ్‌ 3 సినిమా షూటింగ్‌ పూర్తి అయ్యింది అంటూ అధికారికంగా ప్రకటించారు. సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్‌ జరుపుతున్నారు. ముందే విడుదల చేయాలని భావించినా కూడా ఇతర పెద్ద సినిమాల విడుదల కారణంగా ఈ సినిమా ను కాస్త ఆలస్యంగా ఏప్రిల్‌ లో విడుదల చేయాలని నిర్ణయించారు.