Begin typing your search above and press return to search.

'ఎఫ్ 3' ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా..?

By:  Tupaki Desk   |   3 Jun 2022 7:31 AM GMT
ఎఫ్ 3 ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా..?
X
బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ మరియు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్ "ఎఫ్ 3". గత శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా రెండో వారంలోకి అడుగుపెట్టింది.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై రూపొందిన 'ఎఫ్ 3' సినిమా ఫస్ట్ వీక్ లో టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. మొదటి వారంలో సినిమాకు పెద్దగా పోటీ లేకపోవడంతో దేశీయంగానే కాకుండా ఓవర్సీస్ మార్కెట్‌ లోనూ ప్రభావం చూపగలిగింది.

'ఎఫ్ 3' సినిమా మొదటి వారంలో ప్రపంచ వ్యాప్తంగా 94 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా.. 100 కోట్ల గ్రాస్ మార్క్ దిశగా దూసుకుపోతోందని మేకర్స్ ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో రూ. 41.06 కోట్ల షేర్ వసూలు చేయగా.. టోటల్ వరల్డ్ వైడ్ గా 52.1 కోట్లు షేర్ రాబట్టినట్లు తెలిపారు. ఇవి వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ కెరీర్‌ లో ఇదే బిగ్గెస్ట్ ఫిగర్స్ గా నిలిచాయి.

అయితే 'ఎఫ్ 3' సినిమా బ్రేక్‌ ఈవెన్ సాధించాలంటే రెండో వారంలో కూడా బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ గా నిలబడాల్సి ఉంటుంది. కాకపోతే ఈరోజు రిలీజ్ అయిన 'మేజర్' చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో పాటుగా 'విక్రమ్' - 'సుల్తాన్ పృథ్వీరాజ్' వంటి డబ్బింగ్ సినిమాలు కూడా థియేటర్లలోకి వస్తున్నాయి.

మరి వీటి ప్రభావాన్ని తట్టుకొని 'ఎఫ్ 3' మూవీ వసూళ్ళలో జోరు చూపిస్తుందో లేదో చూడాలి. అయితే ఈ సినిమా 8 వారాల తర్వాత మాత్రమే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని మేకర్స్ ఇటీవల ప్రకటించింది. ఇది బాక్సాఫీస్ కలెక్షన్‌లపై సానుకూల ప్రభావం చూపుతుందని చిత్ర బృందం భావిస్తోంది.

'F 3' మేకర్స్ ప్రకటించిన మొదటి వారం తెలుగు రాష్ట్రాల్లో షేర్ వివరాలు పరిశీలిస్తే..
నైజాం - 17 కోట్లు
UA - 5.42 కోట్లు
తూర్పు - 3.2 కోట్లు
వెస్ట్ - 2.44 కోట్లు
సీడెడ్ - 6.7 కోట్లు
గుంటూరు - 3.20 కోట్లు
కృష్ణ - 3.1 కోట్లు
మొత్తం AP/TS షేర్ - 41.06 కోట్లు

కర్ణాటక - 2.30 కోట్లు
రెస్టాఫ్ ఇండియా - 1.5 కోట్లు
ఓవర్సీస్ - 7.2 కోట్లు
వరల్డ్ వైడ్ ఫస్ట్ వీక్ షేర్ - 52.1 కోట్లు
వరల్డ్ వైడ్ గ్రాస్ - 94 కోట్లు

డబుల్ బ్లాక్ బస్టర్ 'ఎఫ్ 2' ఫన్ ఫ్రాంచైజీలో "ఎఫ్ 3" సినిమా తెరకెక్కింది. ఇందులో వెంకటేష్ సరసన తమన్నా భాటియా.. వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ కౌర్ హీరోయిన్లుగా నటించారు. సోనాల్ చౌహాన్ ప్రత్యేక పాత్రలో కనిపించగా.. పూజా హెగ్డే పార్టీ సాంగ్ లో మెరిసింది.

'ఎఫ్ 3' చిత్రాన్ని దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం సమకూర్చారు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించగా తమ్మిరాజు ఎడిటింగ్ వర్క్ చేశారు. సునీల్ - వెన్నెల కిషోర్ - రాజేంద్ర ప్రసాద్ - మురళీ శర్మ - అలీ - రఘుబాబు తదితరులు ఇతర పాత్రలు పోషించారు.