Begin typing your search above and press return to search.

మోక్షజ్ఞ ఎంట్రీపై 'ఎఫ్‌3' డైరెక్టర్‌ క్లారిటీ

By:  Tupaki Desk   |   6 Jun 2022 11:31 AM GMT
మోక్షజ్ఞ ఎంట్రీపై ఎఫ్‌3 డైరెక్టర్‌ క్లారిటీ
X
బ్యాక్‌ టు బ్యాక్ సక్సెస్‌ లతో ఇప్పటి వరకు ప్లాప్‌ అంటూ ఎరగని దర్శకుడు అనిల్ రావిపూడి తాజాగా ఎఫ్ 3 సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బిగ్‌ బ్లాక్ బస్టర్‌ కాకున్నా ఎఫ్ 3 మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. డీసెంట్‌ వసూళ్లను నమోదు చేసింది. అనిల్‌ రావిపూడి ఎఫ్ 3 హడావిడితోనే బిజీగా ఉన్నాడు. విడుదల తర్వాత కూడా ఏమాత్రం వదలకుండా ప్రమోషన్ చేస్తూ థియేటర్లకు జనాలను రప్పించే ప్రయత్నం చేస్తున్నారు.

ఎఫ్‌ 3 సినిమా ప్రమోషన్‌ లో భాగంగా ప్రముఖ న్యూస్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను దర్శకుడు అనీల్‌ రావిపూడి చెప్పుకొచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో మోక్షజ్ఞ కు సంబంధించిన సినిమా ను మీరు చేయబోతున్నారట.. మోక్షజ్ఞ ఎంట్రీ మీ దర్శకత్వంలో అనుకుంటున్నారు. అందులో ఎంత వరకు నిజం ఉంది అంటూ అనిల్ రావిపూడిని ప్రశ్నించారు.

ఆ ప్రశ్నకు సమాధానంగా మోక్షజ్ఞ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెడితే మంచిదే. అయితే నన్ను ఎవరు ఇప్పటి వరకు మోక్షజ్ఞ సినిమా గురించి స్పందించలేదు. ఇప్పటి వరకు పలు సార్లు బాలయ్య గారిని కలిశాను. ఆయన కూడా ఎప్పుడు మోక్షజ్ఞ గురించిన మాటలు మాట్లాడలేదు. ప్రస్తుతం నా దృష్టి పూర్తిగా బాలకృష్ణ గారితో చేయబోతున్న సినిమా పై ఉందంటూ దర్శకుడు అనిల్‌ రావిపూడి చెప్పుకొచ్చాడు.

బాలకృష్ణ తో సినిమా చేస్తున్న సమయంలోనే తదుపరి సినిమా యొక్క స్క్రిప్ట్‌ గురించి ఆలోచిస్తాను. ప్రస్తుతానికి మాత్రం పూర్తిగా నా దృష్టి బాలకృష్ణ సినిమా పైనే అంటూ చెప్పుకొచ్చింది. హీరో బాలయ్య తో సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. పూర్తి కామెడీ మూవీ కాకుండా పటాస్ వంటి ఎంటర్‌ టైనర్‌ కమ్‌ యాక్షన్ సినిమా గా బాలయ్య సినిమా ఉంటుందని అనిల్ రావిపూడి అన్నాడు.

ఇదే సమయంలో ఎఫ్‌4 సినిమా గురించి కూడా అనిల్‌ రావిపూడి క్లారిటీ ఇచ్చాడు. తప్పకుండా ఎఫ్ 4 ఉంటుంది. కాని హీరోయిన్స్ వీళ్లే ఉంటారా అనేది చెప్పలేను. అలాగే హీరోలుగా వీళ్లు ఉంటారా లేదంటే అదనంగా యాడ్‌ అవుతారా అనేది నాకు ఇంకా తెలియదు. కాని ఎఫ 4 చేస్తానంటూ మాత్రం బలంగా హామీ ఇచ్చాడు. ఎఫ్‌ 4 సినిమా కు ఇంకా చాలా సమయం ఉందని.. బాలయ్య తో సినిమా ఆ తర్వాత మరో సినిమా చేసి ఎఫ్ 4ను షురూ చేస్తానంటూ ప్రకటించాడు.

సర్కారు వారి పాట మరియు ఎఫ్‌ 3 సినిమా లతో అనిల్‌ రావిపూడి స్టార్ డమ్‌.. స్థాయి మరింతగా పెరిగింది. దాంతో ఈయనతో సినిమా అంటే పెద్ద హీరోల నుండి చిన్న హీరోల వరకు అంతా కూడా లైన్ లో ఉంటున్నారు. కనుక ఈయన బిజీ బిజీగా ముందు ముందు మరిన్ని సినిమాలు చేస్తే నవ్వుతూ ప్రేక్షకులు సినిమాను ఎంజాయ్ చేస్తారంటూ కామెంట్స్‌ వస్తున్నాయి.