Begin typing your search above and press return to search.

ఎఫ్ 3 జోరు.. అన్న టైమ్‌ కు వచ్చి నవ్విస్తారట

By:  Tupaki Desk   |   26 April 2021 4:30 PM GMT
ఎఫ్ 3 జోరు.. అన్న టైమ్‌ కు వచ్చి నవ్విస్తారట
X
వెంకటేష్‌ మరియు వరుణ్ తేజ్‌ ల కాంబోలో వచ్చిన ఎఫ్‌ 2 సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ప్రస్తుతం ఎఫ్‌ 3 సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. అనీల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఎఫ్‌ 3 సినిమా లో అంతకు మించి అన్నట్లుగా ఎంటర్‌ టైన్‌ మెంట్‌ ఉంటుందని చెబుతున్నారు. దిల్‌ రాజు బ్యానర్‌ లో రూపొందుతున్న ఎఫ్‌ 3 సినిమా ను ఆగస్టులో విడుదల చేయాలని ఇప్పటికే నిర్ణయించారు. సినిమాకు సంబంధించిన చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. కరోనా సెకండ్‌ వేవ్‌ కొనసాగుతున్నా కూడా వచ్చే నెల మొదటి వారం నుండి సినిమా తుది షెడ్యూల్‌ ను చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.

సారధి స్టూడియోలో ప్రస్తుతం సినిమా కోసం ఒక ఇంటి సెట్టింగ్‌ ను వేస్తున్నారు. ఆ సెట్‌ లో వెంకటేష్ మరియు వరుణ్‌ లతో పాటు ముఖ్య నటీనటులపై కీలక సన్నివేశాల చిత్రీకరణ చేయబోతున్నారు. వరుణ్ మరియు వెంకీల మద్య నడిచే కామెడీ సన్నివేశాలు సినిమాకు హైలైట్ గా ఉంటయాని అంటున్నారు. ఇక ఈ సినిమాలో సునీల్ మరియు రాజేంద్ర ప్రసాద్ లు అదనపు ఆకర్షణ గా ఉంటారని మేకర్స్ అంటున్నారు.

టాలీవుడ్ లోని పలు సినిమాలు విడుదల వాయిదాలు పడుతున్నాయి. షూటింగ్ లు ఆలస్యం అవ్వడంతో పాటు కొన్ని సినిమాలు షూటింగ్‌ లు ఆగిపోయాయి. షూటింగ్‌ ఆగిపోవడం వల్ల సినిమా ల విడుదల వాయిదా వేయడం జరిగింది. ఆగస్టులో ఎఫ్‌ 3 సినిమాను విడుదల చేస్తామని ముందే ప్రకటించారు. షూటింగ్‌ అనుకున్నట్లుగా సాగుతున్న నేపథ్యంలో ఇతర సినిమాలతో సంబంధం లేకుండా చెప్పిన టైమ్‌ కు వచ్చి ఎంటర్‌ టైన్‌ చేస్తారని తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే జూన్‌ వరకు ఈ సినిమా షూటింగ్‌ ముగియనుందని మేకర్స్ చెబుతున్నారు.