Begin typing your search above and press return to search.

F2: 15 రోజుల కలెక్షన్స్ ఇవే

By:  Tupaki Desk   |   27 Jan 2019 1:11 PM GMT
F2: 15 రోజుల కలెక్షన్స్ ఇవే
X
సంక్రాంతి సీజన్లో రిలీజ్ అయిన 'F2' జోరు ఇంకా తగ్గడం లేదు. రిలీజ్ అయిన 15 వ రోజు రిపబ్లిక్ డే హాలిడేని ఫుల్ గా వాడుకున్న 'F2' మూడున్నర కోట్ల రూపాయల షేర్ వసూలు చేయడం విశేషం. దీంతో ఈ సినిమా వరల్డ్ వైడ్ టోటల్ 68.83 కోట్లకు చేరింది. ఈ రోజు ఆదివారం కాబట్టి రూ.70 కోట్ల మార్క్ దాటడం లాంఛనమే.

మీడియమ్ రేంజ్ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ సినిమా ఈ రేంజ్ కలెక్షన్స్ సాధించడం అనూహ్యమైన విషయం. గతంలో 'గీత గోవిందం' ఇలాంటి ఫీట్ సాధించి సంచలనం సృష్టించింది. 'F2 తాజాగా 'గీత గోవిందం' ఫుల్ రన్ కలెక్షన్స్ రూ. 68.20 ను క్రాస్ చేసింది. ఇదిలా ఉంటే 'F2' ఓవర్సీస్ లో కూడా తన సత్తా చాటుతోంది. ఈ సినిమా 2 మిలియన్ క్లబ్ లో స్థానం సంపాదించింది. ఓవర్సీస్ లో 2 మిలియన్ డాలర్ క్లబ్ లో చేరిన 14 వ తెలుగు సినిమా F2 కావడం విశేషం.

ప్రపంచవ్యాప్తంగా 15 రోజుల 'F2' కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.

నైజామ్: 19.49 cr

సీడెడ్: 7.21 cr

ఉత్తరాంధ్ర: 8.56 cr

కృష్ణ: 4.47 cr

గుంటూరు: 4.94 cr

ఈస్ట్ : 6.10 cr

వెస్ట్: 3.54 cr

నెల్లూరు: 1.65 cr

ఎపీ + తెలంగాణా టోటల్: రూ. 55.96 cr

రెస్ట్ ఆఫ్ ఇండియా: 4.31 cr

ఓవర్సీస్: 8.56 cr

వరల్డ్ వైడ్ టోటల్: రూ. 68.83 cr