Begin typing your search above and press return to search.

F2: 12 డేస్ కలెక్షన్స్

By:  Tupaki Desk   |   24 Jan 2019 11:13 AM GMT
F2: 12 డేస్ కలెక్షన్స్
X
సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ - మెగా హీరో వరుణ్ తేజ్ కాంబినేషన్లో తెరకెక్కిన 'F2' జనవరి 12 న విడుదలైంది. సంక్రాంతి సీజన్లో చివరగా రిలీజ్ అయినప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాలను మించి కలెక్షన్స్ వసూలు చేసింది. పండగ సీజన్లో ప్రేక్షకులు కోరుకునే ఎంటర్టైన్మెంట్ ఉండడం.. పైగా పోటీలో ఉన్న ఇతర సినిమాలకు పెద్దగా ఆదరణ దక్కకపోవడం తో వెంకీ - వరుణ్ సినిమాకు అడ్డులేకుండా పోయింది.

రిలీజ్ అయిన పన్నెండు రోజులకుగాను తెలుగు రాష్ట్రాలలో 50 కోట్ల రూపాయలకు పైగా షేర్ సాధించింది. ఇప్పటి వరకూ తెలుగు రాష్ట్రాల్లో ఈ ఫీట్ సాధించిన సినిమాలలో ఇది 18 వ సినిమా. ఈ సినిమా వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ వ్యాల్యూ రూ. 34.50 కోట్లు మాత్రమే. పెట్టుబడితో చూసుకుంటే ఇప్పటికే ఈ సినిమా రైట్స్ తీసుకున్న బయ్యర్లందరికి జాక్ పాట్ తగిలినట్టే.

తెలుగు రాష్ట్రాల్లో F2 ఏరియావైజ్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.

నైజామ్: 17.30 cr

సీడెడ్: 6.53 cr

ఉత్తరాంధ్ర: 7.70 cr

కృష్ణ: 4.16 cr

గుంటూరు: 4.25 cr

ఈస్ట్ : 5.76 cr

వెస్ట్: 3.29 cr

నెల్లూరు: 1.52 cr

టోటల్: రూ. 50.48 cr