Begin typing your search above and press return to search.

'F 3': ఈ ఫోటోలో ఉన్న ఐటెమ్ భామ ఎవరో గెస్ చేయగలరా..?

By:  Tupaki Desk   |   15 April 2022 7:32 AM GMT
F 3: ఈ ఫోటోలో ఉన్న ఐటెమ్ భామ ఎవరో గెస్ చేయగలరా..?
X
విక్టరీ వెంకటేష్‌ - మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌ హీరోలుగా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ''ఎఫ్ 3''. ఇది సూపర్ హిట్ 'ఎఫ్ 2' ప్రాంచైజీలో వస్తోన్న రెండో సినిమా. ఇందులో తమన్నా భాటియా - మెహ్రీన్ కౌర్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. సోనాలి చౌహన్ కీలక పాత్రలో సందడి చేయనుంది. సమ్మర్ కానుకగా మే 27న ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.

ఇప్పటికే 'ఎఫ్ 3' చిత్రానికి సంబంధించిన టాకీ పార్ట్ పూర్తవ్వడమే కాదు.. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ను షూట్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేశారు. ఇందులో ఓ స్టార్ హీరోయిన్ ఆడిపాడనుందని చిత్ర యూనిట్ హింట్ ఇచ్చింది.

తాజాగా 'ఎఫ్ 3' టీమ్ ఓ హీరోయిన్ బ్యాక్ సైడ్ లుక్ ని షేర్ చేస్తూ.. ఈ సమ్మర్ మరింత వేడెక్కబోతుంది.. ఒక ప్రత్యేక గీతం కోసం సెట్స్‌ లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ ఎవరో గెస్ చేయమని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. అమ్మడి బాడీ స్ట్రక్చర్ చూసి అందరూ బుట్టబొమ్మ పూజా హెగ్డే అని కామెంట్స్ చేస్తున్నారు.

నిజానికి 'ఎఫ్ 3' సినిమాలో పూజా ఓ ఐటమ్ సాంగ్ చేయనుందని.. ఇందుకుగాను భారీ రెమ్యునరేషన్ తీసుకోనుందని గత రెండు రోజులుగా వార్తలు వస్తున్నాయి. కమర్షియల్‌ సినిమాల్లో ఐటెమ్ సాంగ్‌ పెట్టడం.. అందులో ఒక స్టార్ హీరోయిన్ తో స్టెప్పులు వేయించడం ట్రెండ్‌ గా మారింది. ఇప్పటికే అనేకమంది ముద్దుగుమ్మలు స్పెషల్ నంబర్స్ తో మెప్పించారు.

కన్నడ సోయగం పూజా హెగ్డే సైతం ‘రంగస్థలం’ చిత్రంలో ‘జిగేలు రాణి’ పాటతో యువతరాన్ని ఉర్రూతలూగించింది. ఆ తర్వాత మరే ప్రత్యేక గీతంలో నర్తించని ఈ భామ.. ఇప్పుడు ‘ఎఫ్‌-3’ సినిమాలోని ఓ హుషారైన పాటకు డ్యాన్స్ చేయడానికి రెడీ అయిందని తెలుస్తోంది.

రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ స్పెషల్ సాంగ్ కు ట్యూన్ కంపోజ్ చేశారు. డీఎస్పీ ని ఐటమ్ సాంగ్స్ స్పెసిలిస్ట్ గా పేర్కొంటారు ఆడియన్స్. ఇప్పుడు 'ఎఫ్ 3' కోసం తనదైన శైలి మాస్‌ బాణీలతో ఓ ఐటెం నంబర్ కు రూపకల్పన చేసినట్లు సమాచారం. పూజాహెగ్డే ఆడిపాడనున్న ఈ సాంగ్ సినిమాలో స్పెషల్‌ అట్రాక్షన్‌ గా నిలుస్తుందని భావిస్తున్నారు.

కాగా, 'ఎఫ్‌ 2' చిత్రంలో ఫన్‌ - ఫస్ర్టేషన్‌ కు ఫైనాన్స్ అనే ఎలిమెంట్ ని జత చేసి మూడింతల ఫన్ తో ''ఎఫ్ 3'' చిత్రాన్ని రూపొందించినట్లు మేకర్స్ చెబుతున్నారు. ఇందులో వెంకటేష్ రేచీకటి బాధితుడిగా.. వరుణ్ తేజ్ నత్తిగా మాట్లాడే యువకుడిగా కనిపించనున్నారు. రాజేంద్ర ప్రసాద్ - వెన్నెల కిషోర్ - మురళీ శర్మ - రఘుబాబు - శ్రీకాంత్ అయ్యంగార్ - పృథ్వీరాజ్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు.

దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష్ 'ఎఫ్ 3' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి హర్షిత్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా.. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేసారు. తమ్మిరాజు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.