Begin typing your search above and press return to search.

ప్ర‌గ్యాకు తీర‌ని అన్యాయం.. అంతా మంచికే అంది!

By:  Tupaki Desk   |   25 Jan 2022 7:30 AM GMT
ప్ర‌గ్యాకు తీర‌ని అన్యాయం.. అంతా మంచికే అంది!
X
స‌ల్మాన్ ఖాన్ క‌థానాయ‌కుడిగా తెర‌కెక్కిన `యాంటిమ్ -ది ఫైన‌ల్ ట్రూత్` గ‌త ఏడాది రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. భార అంచ‌నాల న‌డుమ రిలీజ్ అయినా యాంట‌మ్ వాటిని అందుకోవ‌డంలో విఫ‌ల‌మైంది. అయితే ఆ సినిమా వ‌ల్ల ప్ర‌గ్యా జైశ్వాల్ కి తీర‌ని అన్యాయ‌మే జ‌రిగింది. ముందుగా ఇందులో హీరోయిన్ గా ప్ర‌గ్యానే ఎంపిక చేసుకున్నారు. ఆమెపై షూటింగ్ కూడా పూర్తిచేసారు. పాట‌ల చిత్రీక‌ర‌ణ కూడా జ‌రిగింది. అయితే అనూహ్యంగా ఆమెను సినిమా నుంచి త‌ప్పించి వేరే హీరోయిన్ ని ఎంపిక‌ చేసారు. తాజాగా ప్ర‌గ్యా-స‌ల్మాన్ పై షూట్ చేసిన రొమాంటిక్ సాంగ్` మైన్ చ‌లా` పాట‌ని రిలీజ్ చేసారు.

ఈ నేప‌థ్యంలో పాట రిలీజ్ పై ప్ర‌గ్యా స్పందిచింది. ఈ పాట‌లో స‌ల్మాన్ పాత్ర ప్రేమ స‌న్నివేశాలు ఆస‌క్తిక‌రంగా లేక‌పోవ‌చ్చు. అందువ‌ల్లే పాట‌ని సినిమా నుంచి తొల‌గించి ఉండొచ్చ‌ని సందేహం వ్య‌క్తం చేసింది. ఇప్పుడైనా పాట విడుద‌ల‌వ్వ‌డం సంతోషంగా ఉంది అంది. నేను చాలా ఆశావాద వ్య‌క్తిని. జీవితంలో ఏది జ‌రిగితే అది మంచిదేన‌ని న‌మ్ముతాను. సినిమా షూటింగ్ లో ఈ పాట నాకు బాగా న‌చ్చింది. కాబ‌ట్టి సినిమా వ‌ర్కౌట్ కాక‌పోయినా పాట‌ని విడిగా విడుద‌ల చేస్తార‌ని న‌మ్మ‌కం ఉండేది. ఇప్పుడు పాట విడుద‌లైనందుకు సంతోషంగా ఉంది. చిత్ర నిర్మాత‌లు పాట‌ను తొల‌గించ‌డం ప‌ట్ల స‌ల్మాన్ కూడా సంతోషంగా లేరు.

``వాళ్ల నిర్ణ‌యంతో స‌ల్మాన్ ఏకీభ‌వించ‌లేదు. అత‌ను శాయ‌శుక్తులా ప్ర‌య‌త్నం చేసారు. న‌న్ను సినిమాలో ఉంచేందుకు చివ‌రి వ‌ర‌కూ ఆయ‌న ప్ర‌య‌త్నం చేసారు. కానీ ఫ‌లించ‌లేదు`` అని ప్ర‌గ్యాజైశ్వాల్ తెలిపింది. `మేన్ చ‌లా` పాట‌ని గురు రంధ‌వా.. ఇలియాంతూర్ పాడారు. ఈ చిత్రానికి మ‌హేష్ మంజ్రేక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో. మహిమా మ‌క్వానా హీరోయిన్ గా న‌టించింది. ఆయుష్ శ‌ర్మ మ‌రో హీరోగా న‌టించాడు. 50 కోట్ల బ‌డ్జెట్ తో చిత్రాన్ని నిర్మించారు.