Begin typing your search above and press return to search.
మిల్కీలోని కవయిత్రి అలా బయటికొస్తోంది!
By: Tupaki Desk | 9 July 2021 11:00 PM ISTకథానాయికల్లో ఒక్కొక్కరికి ఒక్కో ఎక్స్ ట్రా కరిక్యులర్ ట్యాలెంట్ ఉంటుంది. శ్రుతిహాసన్ .. మమతా మోహన్ దాస్.. నివేధ థామస్ లాంటి భామలు గాయనీమణులుగా రాణించారు. ఇప్పుడు తమన్నా ఏకంగా కవయిత్రిగా సత్తా చాటుతోంది. అది కూడా తన టీవీ షో హోస్టింగ్ లో ఈ ట్యాలెంట్ ని బయటపెట్టడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
ఇటీవల తమన్నా కెరీర్ ఉత్తమ దశలో ఉంది. వరుసగా పాన్ ఇండియా సినిమాల్లో నటించింది. ఏడాది కాలంగా బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో బిజీగా ఉంది. గత సంవత్సరం నుంచి చాలా ప్లాట్ ఫామ్ లలో తన ఉనికిని చాటుకుంటుంది. ఓవైపు ఓటీటీలో నటిస్తూనే పెద్ద తెర అవకాశాల్ని విడిచిపెట్టడం లేదు. మరోవైపు టీవీ హోస్టింగ్ కి రెడీ అయ్యింది.
`మాస్టర్ చెఫ్` తెలుగు షోతో తమన్నా టీవీ హోస్ట్ గా మారుతోంది. ఇప్పుడు మరో విధంగానూ వార్తల్లోకొచ్చింది. తమన్నాలో హిడెన్ కవయిత్రిని బయటపెట్టడం అందరినీ ఆకర్షిస్తోంది. కవిత్వంపై ఇష్టాన్ని సోషల్ మీడియాలలో తమన్నా బయటపెడుతోంది. ఇటీవల తరచుగా ట్విట్టర్లో కోట్స్ రాస్తోంది. అవన్నీ కవితలుగా అలరిస్తున్నాయి.
ఆమె తన లోతైన ఆలోచనలను కవిత్వం రూపంలో బయట పెట్టిన విధానం చూస్తుంటే గొప్ప కవిత్వాన్ని సృష్టించడంలో నైపుణ్యం ఉందని ప్రూవ్ అవుతోంది. ఆమె కోట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రాచుర్యం పొందుతున్నాయి. కెరీర్ మ్యాటర్ కి వస్తే.. గోపిచంద్ సరసన నటించిన సీటీమార్ రిలీజ్ కి రావాల్సి ఉంది. ఇందులో జ్వాలా రెడ్డిగా తమన్నా నటించారు. తమిళంలోనూ పలు చిత్రాలతో తమన్నా బిజీగా ఉంది.