Begin typing your search above and press return to search.

సెన్సార్ అయిపోయింది.. కాచుకోండి

By:  Tupaki Desk   |   4 Jan 2016 10:16 AM GMT
సెన్సార్ అయిపోయింది.. కాచుకోండి
X
సంక్రాంతికి రావాల్సిన మూడు పెద్ద సినిమాల్లో ప్రతి దాని మీదా ఎంతో కొంత అనుమానముంది. కానీ ఆ బడా సినిమాల మధ్య చిన్న సినిమా అనదగ్గ ‘ఎక్స్‌ ప్రెస్ రాజా’ విషయంలో మాత్రం ఏ సందేహాలూ లేవు. జనవరి 14న ఈ సినిమాను విడుదల చేసే విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు యువి క్రియేషన్స్. 13వ తారీఖున యుఎస్‌ లో ప్రిమియర్ షోలకు కూడా సన్నాహాలు జరిగిపోయాయి. థియేటర్లు కూడా బుక్ చేసేసి అగ్రెసివ్ గా ప్రమోషన్లు చేస్తున్నారు నిర్మాతలు. సంక్రాంతి సినిమాల్లో రిలీజ్ డేట్ పోస్టర్లు ముందుగా విడుదల చేసిన సినిమా కూడా ‘ఎక్స్ ప్రెస్ రాజా’నే. కాగా సెన్సార్ విషయంలోనూ తొలి కేక ఈ రాజానే పెట్టాడు.

ఈ రోజే ‘ఎక్స్ ప్రెస్ రాజా’ సెన్సార్ కూడా పూర్తయిపోయింది. సినిమాకు ‘క్లీన్ యు’ సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు. ఐతే నాన్నకు ప్రేమతో - డిక్టేటర్ - సోగ్గాడే చిన్నినాయనా సినిమాల సెన్సార్ మాత్రం ఇంకా జరగలేదు. మరోవైపు ప్రమోషన్ల విషయంలోనూ ‘ఎక్స్ ప్రెస్ రాజా’ చాలా అగ్రెసివ్ గా ఉంది. ది ‘ఎక్స్ ప్రెస్ రాజా’ మూమెంట్ అంటూ విభిన్నంగా ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. ‘బంగారం’ సినిమాలో పవన్ కళ్యాణ్, ‘మిస్టర్ పర్ఫెక్ట్’లో ప్రభాస్ వీధికుక్కల్ని చూసి పరుగులు తీసే మూమెంట్స్ తో వెరైటీ వీడియోలు తయారు చేసి జనాల్ని ఆకర్షిస్తున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో శర్వానంద్, సురభి జంటగా నటించిన సంగతి తెలిసిందే.