Begin typing your search above and press return to search.

అక్కడ ఆడడమే మనకు ప్లస్ -చరణ్‌

By:  Tupaki Desk   |   24 May 2018 11:45 AM IST
అక్కడ ఆడడమే మనకు ప్లస్ -చరణ్‌
X
రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ రంగస్థలం 200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. టాలీవుడ్ లో నాన్ బాహుబలి రికార్డులను అన్నిటినీ ఖాతాలో వేసుకుని.. 50 రోజులు గడిచినా ఇంకా పలు సెంటర్లలో షేర్ పై రన్ అవుతోంది. మరోవైపు అంతర్జాతీయంగా కూడా అనేక ప్రాంతాల్లో ఈ సినిమా రికార్డు వసూళ్లను సాధించింది.

ఇలా ఇతర దేశాల్లో కూడా ఇండియన్ మూవీస్ ఆడడం.. బిజినెస్ పరంగా లాభం చేకూర్చడమే కాకుండా.. నిర్మాణ విలువలు మరింతగా పెరగడానికి దోహదపడుతుందని రామ్ చరణ్ అంటున్నాడు. 'మన దక్షిణాది వరకే తీసుకుంటే.. ఇక్కడి జనాలు గల్ఫ్ దేశాలు.. యూఎస్ తో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా సెటిల్ అయ్యారు. అందుకే మన సినిమాలు అక్కడ విడుదల అయ్యి వసూళ్లను రాబడుతున్నాయి. గ్లోబల్ మార్కెట్లలో కూడా మన సినిమాలు బిజినెస్ చేయడం కారణంగా.. ఇంటర్నేషనల్ ఫిలిం మేకర్స్ తో మనం కలిసే అవకాశాలు చిక్కుతున్నాయి' అంటున్నాడు రామ్ చరణ్.

బాహుబలి మూవీ సృష్టించిన సంచలనాలు.. అలాగే ధనుష్ ఇంటర్నేషనల్ ఫిలిం చేయడం వంటివి ఇందుకు ఉదాహరణగా చెబుతున్నాడు చెర్రీ. సక్సెస్ తో పాటు బాధ్యతలు కూడా పెరగుతాయని చెప్పిన చెర్రీ.. రంగస్థలం తర్వాత తను మరింత అలర్ట్ గా ఉంటానని అన్నాడు. కొత్త విషయాలను స్వీకరించేందుకు ఆడియన్స్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని.. వాటిని అందించేందుకు మేకర్స్ సిద్ధం కావాలని అన్నాడు మెగా పవర్ స్టార్.