Begin typing your search above and press return to search.

రాజమౌళి మ్యాజిక్‌ ఎలా పనిచేస్తుందో...

By:  Tupaki Desk   |   25 Aug 2015 5:00 PM IST
రాజమౌళి మ్యాజిక్‌ ఎలా పనిచేస్తుందో...
X
మహేష్‌ వరుసగా స్టార్‌ డైరెక్టర్ లతో పనిచేస్తున్నాడు. శ్రీనువైట్ల, పూరి జగన్నాథ్‌, త్రివిక్రమ్‌, కొరటాల శివ (100కోట్ల శ్రీమంతుడినిచ్చాడు కదా). సరిగ్గా ఈ టైమ్‌ లో మహేష్‌ హీరోగా సినిమా సెట్స్‌ కెళ్లనుందని జక్కన్న (రాజమౌళి) చెప్పాడు. కాబట్టి రాజమౌళితో మహేష్‌ సినిమా రేంజెలా ఉంటుంది? పాత రికార్డులన్నీ కొట్టేస్తుందా? అన్న ఆసక్తికర చర్చ సాగుతోందిప్పుడు.

రాజమౌళి ఇప్పటికే ఎందరో స్టార్ లను తయారు చేశాడు. ఎన్టీఆర్‌, ప్రభాస్‌, చరణ్‌, నాని ఇలా హీరోలెందరో స్టార్‌ స్టాటస్‌ ని ఎంజాయ్‌ చేస్తున్నారంటే అతడి వల్లే. ఎన్టీఆర్‌ కి స్టూడెంట్‌ నంబర్‌ 1, సింహాద్రి, యమదొంగ వంటి హిట్‌ సినిమాల్ని ఇచ్చాడు. స్టూడెంట్‌ నంబర్‌ 1 ఎన్టీఆర్‌ కి రెండో సినిమా. అలాగే చరణ్‌ కి ద్వితీయ ప్రయత్నమే 'మగధీర' వంటి రికార్డ్‌ హిట్‌ ని అందించాడు. మగధీర రికార్డుల్ని దశాబ్ధం పాటు ఎవరూ టచ్‌ చేయలేకపోయారు. అటు ఎన్టీఆర్‌ కి కానీ, ప్రభాస్‌ కి కానీ ఆ సీన్‌ రాలేదు.

రాజమౌళి దర్శకత్వంలోనే 'బాహుబలి' వచ్చి, ఇంతకాలానికి మగధీర సహా అన్ని రికార్డుల్ని కొట్టేసింది. దీంతో ప్రభాస్‌ టాప్‌ లీగ్‌ లోకి వెళ్లిపోయాడు. నాని 'ఈగ' తర్వాత పెద్ద స్థాయికి ఎదిగాడు. ఇకపోతే ఇప్పుడు మహేష్‌ తో సినిమా తీస్తున్నాడు కాబట్టి ఈ సినిమా గత రికార్డుల్ని కొట్టేస్తుందా? ప్రభాస్‌ (బాహుబలి), చరణ్‌ (మగధీర)ల రికార్డ్‌ హిట్లను దాటి వెళుతుందా? రాజమౌళి మ్యాజిక్‌ మహేష్‌ కి ఎంతవరకూ కలిసొస్తుంది? అన్న చర్చ సాగుతోంది. కాలమే దీనికి సమాధానం చెప్పాలి.