Begin typing your search above and press return to search.
ఇంతకీ రెండో బాహుబలిలో ఏముంటుంది?
By: Tupaki Desk | 11 July 2015 4:51 PM ISTఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బాహుబలి విడుదలైపోయింది. కనీవినీ ఎరుగని కలెక్షన్లతో దూసుకెళ్తోంది. టాలీవుడ్‌లో మాత్రమే కాదు.. బాలీవుడ్, కోలీవుడ్‌లోనూ ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. మన రాజమౌళిని అందరూ ఆకాశానికెత్తేస్తున్నారు. అందరూ చివరగా అంటున్న మాట.. ''బాహుబలి-2 ఎప్పుడొస్తుంది.. ఆగలేం'' అని. బాహుబలి అద్భుతాల్ని చూశాక.. ఇంకో పార్ట్ కోసం ఏడాది పాటు ఎదురు చూడటం కష్టమైన విషయమే.
బాహుబలి విడుదలవడానికి ముందు వాట్సాప్ తదితర సోషల్ మీడియాలో ఆ సినిమా కథ ఇలా ఉండొచ్చు.. అన్న ఓ గెస్‌తో కొందరు ఓ మెసేజ్ సృష్టించారు. అది ఓ అంచనాతో రాసిందా.. లేక సోర్స్ ద్వారా తెలుసుకుందా అన్నది పక్కనబెడితే.. ఆ కథకు సినిమా చాలా దగ్గరగానే అనిపించింది. కొంచెం అటు ఇటు అయినప్పటికీ బాగానే గెస్ చేశారు జనాలు. నిజానికి బాహుబలి క్యారెక్టర్ల గురించి రాజమౌళి అండ్ కో చెప్పిందాన్ని బట్టి.. ట్రైలర్‌ను బట్టి చూస్తే.. సామాన్యులు కూడా కథ మీద ఓ అంచనాకు వచ్చేయొచ్చు.
ఫస్ట్ పార్ట్ వరకు అంచనాలకు దగ్గరగా ఉండటంతో ఇక రెండో పార్ట్ కథ మీద కూడా అంచనాలు మొదలైపోయాయి. రెండో పార్ట్‌లో బాహుబలి పట్టాభిషేకంతో కథ మొదలై.. ఆ తర్వాత దేవసేనతో అతడి పెళ్లి జరగడం.. ఇంతలో భల్లాల దేవుడు కుట్ర చేసి బాహుబలిని చంపేయడం.. దేవసేనను కారాగారంలో బంధించడం.. బాహుబలి బిడ్డను కూడా చంపేయబోతుంటే శివగామి రక్షించడం.. ఇదంతా ఫ్లాష్‌బ్యాక్‌లో నడిస్తే.. ప్రెజెంట్ ఈ కథంతా విన్న శివుడు.. మహిష్మతిలో తనకు మద్దతుగా నిలిచేవాళ్లను కలుపుకుని భల్లాలదేవుణ్ని చంపడం.. ఇలా ఉండొచ్చని బాహుబలి-2 మీద అంచనాకు వచ్చేశారు జనాలు. మరి జక్కన్న ఆలోచనలు ఎలా ఉఉన్నాయో మరి.