Begin typing your search above and press return to search.
నాలుగైదు జాతీయ అవార్డులు రావాలి
By: Tupaki Desk | 8 July 2015 5:00 PM IST1.. 2.. 3.. అంటూ గడియల్ని లెక్కిస్తున్నారంతా. బాహుబలి కోసమే ఈ ఎదురు చూపు. ప్రపంచం కళ్లన్నీ బాహుబలి పైనే. భారతదేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన చిత్రమిది. దేశ కీర్తి ప్రతిష్ఠను ప్రపంచ సినీయవనికపై ఆవిష్కరించే ఏకైక చిత్రమిదని ప్రచారమవుతోంది. అంతేనా ఈ సినిమా కోసం బోలెడుమంది జాతీయ అవార్డు గ్రహీతలు పనిచేశారు. ఇందులో నటీనటులు, సాంకేతిక నిపుణులు ఉన్నారు. దేశ విదేశాల నుంచి టాప్ మోస్ట్ ఫైట్ మాష్టర్లు, విజువల్ ఎఫెక్ట్స్ టీమ్స్, మిక్సింగ్ టీమ్‌లు పనిచేశాయి.
ఓ అధికారిక లెక్క ప్రకారం ఈ సినిమాలో ప్రతి సన్నివేశంలో విజువల్ గ్రాఫిక్స్‌ని ఉపయోగించారు. దాదాపు 85శాతం మేర గ్రాఫిక్స్‌ని ఇన్‌బిల్ట్ చేశారు. సన్నివేశాల్ని బ్లూమాట్, గ్రీన్‌మాట్ ఫార్మాట్‌లలో తెరకెక్కించి అవసరమైన విజువల్ గ్రాఫిక్స్‌ని జోడించారు. దీనికోసం రాజమౌళి రకరకాల దేశాలు తిరిగొచ్చాడు. అంతే కాదండోయ్ ఈ చిత్రానికి కెమెరా వర్క్, ఆర్ట్ డిపార్ట్‌మెంట్, మ్యూజిక్, ఎఫెక్ట్స్ విభాగాల్లో అవార్డులు పొందిన దిగ్గజాలెందరో పనిచేశారు. ఓ లెక్క ప్రకారం దాదాపు 25 మంది జాతీయ అవార్డులు అందుకున్నవాళ్లు ఈ సినిమా కోసం శ్రమించారని తెలుస్తోంది. ఇంతమంది కృషి ఫలించే రోజొచ్చేస్తోంది. ఈ శుక్రవారం 10న రిలీజ్. అంతేనా ఇంతమంది దిగ్గజాలు పనిచేశారు కాబట్టి బాహుబలికి కనీసం నాలుగైదు విభాగాల్లో ఈసారి జాతీయ అవార్డులు దక్కాల్సిందేనని అంటున్నారంతా.