Begin typing your search above and press return to search.

గీత కు మరో గోవిందం అవుతుందా?

By:  Tupaki Desk   |   31 Aug 2018 6:02 AM GMT
గీత కు మరో గోవిందం అవుతుందా?
X

'గీత గోవిందం' సూపర్ హిట్ అయినప్పటినుండి మళ్ళీ గీతా ఆర్ట్స్ పేరు మార్మోగిపోతోంది. బన్నీ వాసు నిర్మాత అయినప్పటికీ బ్యాక్ బోన్ గా అల్లు అరవింద్ ఉంటారని అందరికీ తెలిసిందే. దీంతో అల్లు అరవింద్ తాజాగా టేకప్ చేసిన చిన్న బడ్జెట్ సినిమా 'పేపర్ బాయ్' ఫలితం పై అందరి దృష్టి పడింది.

డైరెక్టర్ సంపత్ నంది కథ అందించడమే కాకుండా కొత్తవారితో నిర్మించిన ఈ సినిమా ఈరోజు రిలీజ్ కానుంది. సినిమా నచ్చడంతో గీతా ఆర్ట్స్ వారు హోల్ సేల్ గా థియేట్రికల్ రైట్స్ ను తీసుకున్న విషయం తెలిసిందే. అల్లు అరవింద్ జడ్జిమెంట్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు కాబట్టి అయన మ్యాజిక్ టచ్ ఈసారి కూడా పనిచేస్తుందా లేదా అని అందరూ ఎదురు చూస్తున్నారు.

కాంపిటీషన్ లో పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు లేకపోవడం మాత్రం 'పేపర్ బాయ్' కి కలిసొచ్చే అంశమే. నిన్న రిలీజ్ అయిన 'నర్తనశాల' కు రెస్పాన్స్ పాజిటివ్ గా లేదు. ఈరోజు రిలీజ్ అవుతున్న ఇతర చిన్న సినిమాలు 'క్రైమ్ 23'.. 'సమీరం' పై పెద్దగా బజ్ లేదు. నయనతార డబ్బింగ్ సినిమా 'కోకో కోకిల' పై ఆడియన్స్ కు కాస్త ఇంట్రెస్ట్ ఉంది గానీ నిర్మాతలు ప్రమోషన్స్ సరిగా చేయలేదు. అయినా నయన్ కోసం సినిమాకు వెళ్ళే ప్రేక్షకులు ఉంటారు. ఇవన్నీ చూస్తే దాదాపుగా 'పేపర్ బాయ్' ప్రేక్షకులకు ఫస్ట్ చాయిస్ అయ్యే అవకాశం ఉంది. గీతా వారికి ఇది మరో గోవిందం అవుతుందా లేదా అనేది సాయంత్రానికి తెలుస్తుంది.