Begin typing your search above and press return to search.

ఎక్స్ క్లూజివ్: అసురన్ రేసు లో అడ్డాల

By:  Tupaki Desk   |   15 Nov 2019 7:54 AM GMT
ఎక్స్ క్లూజివ్: అసురన్ రేసు లో అడ్డాల
X
ధనుష్ హీరో గా నటించిన తమిళ సూపర్ హిట్ 'అసురన్' త్వరలో తెలుగు లోకి రానున్న విషయం తెలిసిందే. సీనియర్ నిర్మాత సురేష్ బాబు ఈ సినిమా ను తమ్ముడు విక్టరీ వెంకటేష్ తో నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా కు తెలుగు లో ఎవరు దర్శకత్వం వహిస్తారనే విషయం పై ఇప్పటికే చాలా మంది పేర్లు వినిపించాయి. తాజా సమాచారం ప్రకారం ఈ రేస్ లోకి శ్రీకాంత్ అడ్డాల వచ్చారు.

ఇప్పటికే సురేష్ బాబు తో ఈ దిశ గా చర్చలు సాగుతున్నాయని.. చర్చలు చివరి దశలో ఉన్నాయని త్వరలోనే ఈ సినిమా ప్రకటన వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. నిజానికి శ్రీకాంత్ అడ్డాల తన తదుపరి చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ లో చేయాల్సి ఉంది. అయితే దానికి మరికొంత సమయం పట్టేలా ఉంది. ఆ లోపు శ్రీకాంత్ అడ్డాలకు 'అసురన్' రీమేక్ ఛాన్స్ వచ్చిందని సమాచారం. శ్రీకాంత్ అడ్డాల గతం లో తెరకెక్కించిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమా లో వెంకీ ఒక హీరో గా నటించిన సంగతి తెలిసిందే. దీంతో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం పట్ల వెంకీ సానుకూలంగా ఉన్నారట.

ఇక ఈ సినిమా హీరోయిన్ విషయం లో కూడా జోరు గా చర్చలు సాగుతున్నాయట. సురేష్ బాబు ఈ సినిమాకు శ్రియ ను తీసుకుందామని భావిస్తున్నారట. అయితే శ్రీకాంత్ అడ్డాల మాత్రం వెంకటేష్ కు జోడీగా అనుష్క బాగుంటుందని చెప్పారట. త్వరలో నే 'అసురన్' రీమేక్ కు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడవుతాయి.