Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్30 గురించి ఆసక్తికరమైన సమాచారం

By:  Tupaki Desk   |   19 April 2020 3:00 PM IST
ఎన్టీఆర్30 గురించి ఆసక్తికరమైన సమాచారం
X
సినిమా తెరకెక్కబోతుందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే దీనికి సంభందించిన అధికారిక ప్రకటన కూడా ఇచ్చేసారు. వాస్తవానికి 'అరవింద సమేత' విడుదలైన సమయంలోనే వీరి కాంబోలో మరో మూవీ ఉంటుందని చెప్పారు. ఎన్టీఆర్ కెరీర్ లో 30వ చిత్రంగా వస్తున్న ఈ సినిమాని హారిక అండ్ హాసిని ఎంటర్ టైన్ మెంట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ పై రాధాకృష్ణ - కళ్యాణ్ రామ్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి 'అయినను పోయిరావలె హస్తినకు' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ప్రస్తుతం ఈ సినిమాకు స్క్రిప్ట్ ను రెడీ చేసే పనిలో ఉన్నాడు త్రివిక్రమ్. కరోనా ఎఫెక్ట్ తగ్గి లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశాలున్నాయి. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుండి హీరోయిన్ విషయంలో రోజుకొక రూమర్ పుట్టుకొస్తూనే ఉంది. రకరకాల పేర్లు అయితే వినిపిస్తూ వచ్చాయి కానీ ఎవరి పేరును ఇంకా ఫైనల్ చేయలేదు. ఇంతకముందు జాన్వీ కపూర్ - పూజాహెగ్డే అన్నారు.. తర్వాత రష్మిక మదన్న అంటున్నారు. కానీ ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారన్న దానిపై ఇప్పటికీ క్లారిటీ అయితే రాలేదు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఒక ఆసక్తికర విషయం బయటకి వచ్చింది.

లాక్ డౌన్ సమయంలో ఇంటికే పరిమితమైన ఎన్టీఆర్ - త్రివిక్రమ్ శ్రీనివాసులు డైలీ ఫోన్ కాల్స్ ద్వారా ఈ స్క్రిప్ట్ డెవలప్ మెంట్ గురించి డిస్కషన్ చేసుకుంటున్నారట. అంతేకాకుండా ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరైతే బాగుంటుందని ఆలోచిస్తున్నారట. స్క్రిప్ట్ విషయాల్లో బాగా శ్రద్ధ తీసుకుంటున్న తారక్ ఈ స్క్రిప్ట్ లో ఎంటెర్ టైన్ మెంట్ పాళ్ళు ఎక్కువగా ఉండేలా చూడాలని త్రివిక్రమ్ ని కోరాడట. ఆర్.ఆర్.ఆర్ వంటి సీరియస్ మూవీ తర్వాత ఎంటర్ టైనర్ అయితే బాగుంటుందని ఎన్టీఆర్ భావిస్తున్నారట. నిజానికి 'టెంపర్' సినిమా తర్వాత తారక్ స్క్రిప్ట్ సెలక్షన్ లో చాలా మార్పు వచ్చిందని చెప్పవచ్చు. ఆ సినిమాతో మొదలైన ఆయన విజయ పరంపర ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. మరి ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మరో చిత్రం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించే అవకాశం ఉంది. ఇదే కనుక నిజమైతే మరోసారి టి.టి.టి కాంబో రిపీట్ అవుతుంది.