Begin typing your search above and press return to search.

ద‌స‌రా ట్రీట్: ఖిలాడీ మాస్ రాజా ఇస్పీడ్ చూశారా

By:  Tupaki Desk   |   25 Oct 2020 6:45 AM GMT
ద‌స‌రా ట్రీట్: ఖిలాడీ మాస్ రాజా ఇస్పీడ్ చూశారా
X
మాస్ మ‌హారాజా ర‌వితేజ మాంచి స్పీడుమీదున్నాడు. గ‌తంతో పోలిస్తే వ‌రుస‌గా సినిమాల్ని ట్రాక్ ‌లోకి తీసుకొస్తున్నాడు. `బెంగాల్ టైగ‌ర్‌` టైమ్ లో త‌న లుక్ పై విమ‌ర్శ‌లు పీక్స్ కి చేరుకోవ‌డంతో ఇటీవ‌ల టోట‌ల్ లుక్ మార్చేశాడు. క్రాక్ తో ఫుల్ ట్రాక్ లోకొచ్చేశాడు. ర‌వితేజ మ‌ళ్లీ తన‌దైన స్టైల్ లోకి మేకోవ‌ర్ అయ్యాడు. `బెంగాల్ టైగ‌ర్‌`కి ముందు ఎంత హ్యాంట్స‌మ్ గా వున్నాడో మ‌ళ్లీ అదే లుక్ ‌లోకి వ‌చ్చేశాడు. ఈ లాక్ ‌డౌన్ టైమ్ ‌ని అందుకు బాగానే వాడుకున్న ర‌వితేజ తాజా లుక్ తో హి ఈజ్ బ్యాక్ అనేంత‌గా మారిపోవ‌డం గ‌మనార్హం.

విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్భంగా ర‌వితేజ రిలీజ్ చేసిన `ఖిలాడీ` పోస్ట‌ర్ లో లాంగ్ స్లీవ్స్ బ్లాక్ టీష‌ర్ట్ ధ‌రించి క‌నిపిస్తున్నతీరు ఇందుకు అద్దంప‌డుతోంది. ఈ పోస్ట‌ర్ లో ర‌వితేజ చాలా ఇంటెన్స్ గా క‌నిపిస్తున్నాడు. ద‌స‌రా శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ ర‌వితేజ ఈ పోస్ట‌ర్ ‌ని అభిమానుల‌తో పంచుకున్నాడు. ప్ర‌స్తుతం ర‌వితేజ న‌టిస్తున్న తాజా చిత్రం `ఖిలాడీ`. ర‌మేష్ వ‌ర్మ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. హ‌వీష్ ప్రొడ‌క్ష‌న్ అండ్ పెన్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కోనేరు స‌త్య‌నారాయ‌ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇటీవ‌లే ఈ మూవీ స్టార్ట‌యింది. కొత్త త‌ర‌హా పాత్ర‌లో ర‌వితేజ న‌టిస్తున్న ఈ మూవీపై భారీ అంచ‌నాలు ఏర్ప‌‌డ్డాయి. ఇందులో ర‌వితేజ ద్విపాత్రాభిన‌యం చేస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌద‌రి, .. డింపుల్ హ‌యాతీ హీరోయిన్ లుగా న‌టిస్తున్నారు.