Begin typing your search above and press return to search.

సూపర్ హిట్ 'సీక్వెల్'కు రంగం సిద్ధమైందట..!

By:  Tupaki Desk   |   5 April 2021 11:30 AM GMT
సూపర్ హిట్ సీక్వెల్కు రంగం సిద్ధమైందట..!
X
సినీ ఇండస్ట్రీలో సూపర్ హిట్ సినిమాలకు సీక్వెల్స్ రూపొందించడం ఎప్పటినుండో జరుగుతున్నదే. ప్రస్తుత సీక్వెల్స్ అండ్ బయోపిక్స్ టైంలో తమిళ దర్శకుడు సెల్వరాఘవన్ తను తెరకెక్కించిన ఓ సూపర్ హిట్ మూవీ సీక్వెల్ కి ప్లాన్ చేస్తున్నాడు. గతంలో ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘యుగానికి ఒక్కడు’ మూవీ అటు తమిళంలో ఇటు తెలుగులో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. మంచి కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ ప్రయోగాత్మక చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు ఆ ఏడాది అవార్డులు కూడా అందుకుంది. అయితే ఇప్పుడు ఆ సినిమాను సీక్వెల్ చేస్తే బాగుంటుందని ఇదివరకే ఆలోచించి ప్రకటించాడు సెల్వరాఘవన్. నిజానికి యుగానికి ఒక్కడులో చోళులు, పాండ్యులకు సంబంధించిన ఆసక్తికరమైన ఎపిసోడ్స్ ఒక కొత్త ఫీల్ తీసుకొచ్చాయి.

ఒక్కో సమస్యను దాటుకుంటూ సాగే ఇంటరెస్టింగ్ ట్విస్టులతో ఈ సినిమా అప్పట్లో బిగ్గెస్ట్ అడ్వెంచర్ మూవీ. దర్శకుడు సెల్వరాఘవన్ 7/జి బృందావన కాలనీ సినిమా సూపర్ సక్సెస్ తర్వాత తెలుగులో చేసిన 'ఆడవారిమాటలకు అర్దాలే వేరులే' సూపర్ హిట్ తో తెలుగులో శ్రీరాఘవ అనే నేమ్ సెట్ చేసుకున్నాడు. దీంతో తెలుగులో 'యుగానికి ఒక్కడు' రిలీజ్ అవ్వగానే సాలీడ్ ఓపెనింగ్స్ అందుకుంది. చోళరాజుల నేపథ్యంలో సాగే కథను మరోమారు రూపొందించాలనే ఆసక్తి తనలో అలాగే ఉందంటూ ట్విట్టర్ ద్వారా ఇదివరకే తెలియజేశాడు దర్శకుడు. కానీ ఈసారి సీక్వెల్ మాత్రం హీరో ధనుష్ తో తెరకెక్కించనున్నాడు. లాక్ డౌన్ సమయంలో సీక్వెల్ పోస్టర్ కూడా రిలీజ్ చేసాడు. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కానుందని టాక్. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ వర్క్ మొదలైందట. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాను 2024లో విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు ఇండస్ట్రీవర్గాలు చెబుతున్నాయి.