Begin typing your search above and press return to search.

చిరు మిన‌హా హీరోలంతా భాగ్య‌న‌గరంలోనే బిజీ బిజీ!

By:  Tupaki Desk   |   13 Dec 2022 12:30 PM GMT
చిరు మిన‌హా హీరోలంతా భాగ్య‌న‌గరంలోనే బిజీ బిజీ!
X
టాలీవుడ్ స్టార్ హీరోలంతా ఆన్ సెట్స్ లో బిజీగా ఉన్నారు. ఇన్ డోర్..ఔట్ డోర్ షూటింగ్ లంటూ డే అండ్ నైట్ శ్ర‌మిస్తున్నారు. కొంద‌రు హీరోలు రిలీజ్ తేదీలు కూడా లాక్ చేసి పెట్ట‌డంతో వాటిక‌గుణంగా ప‌నిచేస్తున్నారు. వీలైనంత త్వ‌ర‌గా షూటింగ్ పూర్తిచేసి ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌న్న కృత నిశ్చ‌యంతో ప‌ని చేస్తున్నారు. ఏ హీరోలు ఎవ‌రెవ‌రు ఎక్క‌డెడ‌క్కడ‌ బిజీగా ఉన్నారో చూస్తే స‌రి.

సంక్రాంతి కానుక‌గా ఇప్ప‌టికే 'వాల్తేరు వీర‌య్య‌'..'వీర సింహారెడ్డి' బ‌రిలోకి దిగిన సంగ‌తి తెలిసిందే. చిరంజీవి హీరోగా న‌టిస్తోన్న వాల్తేరు వీర‌య్య ఇప్ప‌టికే చాలా భాగం షూటింగ్ పూర్త‌యింది. బ్యాలెన్స్ రెండు పాట‌ల షూటింగ్ కోసం యూరిప్ వెళ్లింది. ప్ర‌స్తుతం అక్క‌డే చిరంజీవి-శ్రుతిహాసన్ పై ఆ పాట‌ల చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది. దీంతో షూటింగ్ పూర్త‌వుతుంది.

మ‌రోవైపు పోస్ట్ ప్రొడ‌క్ష‌న నులు శ‌ర వేగంగా జ‌రుగుతున్నాయి. ఇక బాల‌య్య 'వీర‌సింహారెడ్డి' షూటింగ్ ఇప్ప‌టికే పూర్త‌యింది. బ్యాలెన్స్ ఒక్క పాట కూడా ఇటీవ‌లే పూర్తిచేసారు. దీంతో మ‌రో ఆలోచ‌న‌లేకుండా సింహం 108వ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ల‌డం రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు పెట్ట‌డం కూడా జ‌రిగిపోయింది. ప్ర్తస్తుతం హైద‌రాబాద్కి స‌మీపంలో గ‌ల బాచుప‌ల్లిలో షూటింగ్ జ‌రుగుతోంది.

అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తోన్న 'పుష్ప‌-2' షూటింగ్ ఎర్రమంజిలి కాల‌నీలో జ‌రుగుతోంది. ఇందులో కీల‌క స‌భ్యులంతా పాల్గొన్నారు. అలాగే మొన్న‌టివ‌ర‌కూ 'ప్రాజెక్ట్ -కె' తో బిజీగా ఉన్న ప్ర‌భాస్- మారుతి సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ సినిమా రెండ‌వ షెడ్యూల్ నానాక్రామ్ గూడ‌లో జ‌రుగుతోంది. తొలి షెడ్యూల్ లో డార్లింగ్ పాల్గొన‌ని సంగ‌తి తెలిసిందే.

ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్ 'హరిహ‌ర వీర‌మల్లు' షూటింగ్లో బిజీగా ఉన్నారు. రామోజీ ఫిలిం సిటీలో ఈ సినిమా షూటింగ్ జ‌రుగుతోంది. నాచైత‌న్య‌-వెంక‌ట్ ప్ర‌భు కాంబినేష‌న్ ల‌తో తెర‌కెక్కుతోన్న సినిమా కోకాపేట్ స‌మీపంలో షూటింగ్ జ‌రుపుకుంటోంది.

సాయితేజ్ న‌టిస్తోన్న 'విరూపాక్ష' షూటింగ్ అల్యుమినియం ఫ్యాక్ట‌రీలో...సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ న‌టిస్తోన్న 'డీజే టిల్లు -2'.. రామ్- బోయ‌పాటి తాజా షెడ్యూల్ అన్న‌పూర్ణ స్ట‌డియోస్ లో జ‌రుగుతోంది. ఇలా హీరోలంతా దాదాపు హైద‌రాబాద్ లోనే షూటింగ్ జ‌రుపుకుంటే...చిరు ఒక్క‌రే దేశం దాటిన‌ట్లు తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.