Begin typing your search above and press return to search.

తెలివిగా ఆడిన కాజల్‌.. సన్నీకి ఎవిక్షన్ ఫ్రీ పాస్

By:  Tupaki Desk   |   20 Nov 2021 6:31 AM GMT
తెలివిగా ఆడిన కాజల్‌.. సన్నీకి ఎవిక్షన్ ఫ్రీ పాస్
X
కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా రింగు ఈజ్ కింగ్ ను ఆడిన పోటీదారుల్లో మానస్ విజయం సొంతం చేసుకున్నాడు. అలా చాలా వారాలకు మానస్ కెప్టెన్‌ అయ్యాడు. మొదటి నుండి చాలా స్ట్రాంగ్‌ గా ఆడుతూ వచ్చిన మాన్ కు ఇప్పటికే కెప్టెన్సీ రావాల్సి ఉన్నా కూడా అదృష్టం కలిసి రాక అతడికి రాలేదు. ఎట్టకేలకు అతడు కెప్టెన్ అయ్యాడు. ఇక కెప్టెన్ అయిన మానస్ కాజల్‌ వద్దకు వెళ్లి నీకు ఏ డిపార్ట్‌ మెంట్ కావాలో తీసుకోమంటూ సూచిస్తాడు. అప్పుడు తనకు ఏదైనా పర్వాలేదు అన్నట్లుగా ఆమె చెప్పింది. కెప్టెన్సీ టాస్క్ పూర్తి అయిన తర్వాత బిగ్‌ బాస్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ కు సంబంధించిన టాస్క్ ను ఇవ్వడం జరిగింది. ఈ టాస్క్ లో భాగంగా బజర్ మోగిన సమయంలో ఇంటి సభ్యుల్లో ఇద్దరు ఫైర్ ఇంజన్‌ ఎక్కాల్సి ఉంటుంది. ఆ సమయంలో వారికి రెండు ఫొటోలు ఎదురుగా ఉంటాయి. ఆ ఫొటోల్లో ఉన్న వారిలో ఒకరిని సేవ్ చేయాల్సి ఉండగా మరొకరి ఫొటోను కాల్చి వేస్తారు.

మొదటగా ఈ ఫైర్ ఇంజన్ లోకి సన్నీ మరియు రవిలు ఎక్కారు. వారి ముందుకు శ్రీరామ చంద్ర మరియు మానస్ ల ఫొటోలు వచ్చాయి. వారిద్దరు ఏకాభిప్రాయంతో శ్రీరామ చంద్రను సేవ్‌ చేసి మానస్ ఫొటోను కాల్చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. అలా పక్రియ జరుగుతున్న సమయంలో చివర్లో మానస్ మరియు కాజల్‌ లు ఫైర్ ఇంజన్‌ ఎక్కారు. ఆ సమయంలో వారికి సిరి మరియు ఆనీ మాస్టర్ ల ఫొటోలు వచ్చాయి. వారిద్దరిలో ఎవరిని సేవ్‌ చేయాలని అనుకుంటున్నారు అన్నప్పుడు ఇద్దరు కూడా ఒక అభిప్రాయంకు వచ్చేందుకు ఓకే చెప్పలేదు. కాజల్‌ మాత్రం సిరిని సేవ్‌ చేద్దామంటూ బలంగా వాదిస్తే మానస్ మాత్రం ఆనీ మాస్టర్ ను సేవ్‌ చేద్దాం అంటూ కాజల్ ముందు ప్రపోజల్‌ ఉంచాడు.

ఇద్దరు కూడా తుది నిర్ణయానికి రాలేక పోయారు. చివరి నిమిషంలో సరే సిరికి తాను మద్దతు ఇస్తున్నట్లుగా చెప్పడంతో వెంటనే కాజల్‌ మనసు మార్చుకుని ఆని మాస్టర్‌ కు నేను సపోర్ట్‌ చేస్తాను అన్నట్లుగా ప్రకటించింది. ఇంతలో సమయం పూర్తి అయ్యి ఇద్దరు కూడా కాలిపోయారు. ఈ విషయమై కాజల్‌ తొండి ఆడింది అంటూ ఆనీ మాస్టర్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆమె కావాలని ఇద్దరిని కూడా కాల్చేసిందని ఆనీ తెలియజేసింది. ఇక బిగ్‌ బాస్ ఎవిక్షన్‌ ఫ్రీ పాస్ ను చివరి విరకు మిగిలి ఉన్న సన్నీకి దక్కింది. ఈ పవర్‌ ను వచ్చే వారంలో లేదా ఆ తర్వాత వారంలో అయినా ఎప్పుడైనా సన్నీ ఉపయోగించుకోవచ్చు.