Begin typing your search above and press return to search.

'గమనం' విడుదలకు అంతా సిద్దం

By:  Tupaki Desk   |   1 Dec 2021 9:55 AM GMT
గమనం విడుదలకు అంతా సిద్దం
X
శ్రియ ప్రథాన పాత్రలో నటించిన చిత్రం గమనం. ఈ సినిమా మూడు విభిన్నమైన కథలతో ఆసక్తికర స్క్రీన్‌ ప్లేతో సాగబోతుంది. ఆ మూడు కథలకు సంబంధించిన విషయాలు హృదయాన్ని హత్తుకునేలా ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఫీల్ కు గురి అయ్యేలా ఉంటుందని ఇప్పటికే విడుదల అయిన టీజర్ మరియు ట్రైలర్ ను చూస్తుంటే అర్థం అవుతోంది. ట్రైలర్ తో సినిమాపై అంచనాలు ఆసక్తిని పెంచడంలో సక్సెస్‌ అయ్యాయి. ముఖ్యంగా ట్రైలర్ లో చివర్లో వచ్చిన వరద షాట్స్ సినిమా లో అసలు ఉండబోతున్న మ్యాటర్ ఏంటీ అన్నట్లుగా ఆసక్తిని కలిగిస్తుంది. తెలుగు లో మాత్రమే కాకుండా సౌత్ లో అన్ని భాషల్లో నార్త్‌ లో హిందీలో విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు మొదలయ్యాయి.

డిసెంబర్‌ 10వ తారీకున విడుదల కాబోతున్న ఈ సినిమా లో శ్రియా మాత్రమే కాకుండా ప్రియాంక జవాల్కర్ ఇంకా పలువురు నటీ నటులు కనిపించబోతున్నారు. శ్రియ ఈ సినిమాలో చెవిటి తల్లి పాత్రలో కనిపించబోతుంది. భర్త చేతిలో మోస పోయి చిన్నారిని పెంచుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటుంది. మరో వైపు క్రికెట్ అంటే ప్రాణం అయిన వ్యక్తి అమ్మాయి ప్రేమలో పడి తన జీవితాన్ని ఎలాంటి మలుపులు తిరిగేలా చేసుకున్నాడు అనేది ఇంకో కథ. ఇక చివరగా చెత్త ఏరుకునే పిల్లలు తమ పుట్టిన రోజు గురించి.. పుట్టిన రోజు వేడుక గురించి సెర్చ్‌ చేస్తూ ఉంటారు. అలాంటి ఈ మూడు కథలకు ఉన్న కనెక్షన్‌ ఏంటీ.. అసలు ఎందుకు ఈ మూడు కథల్లో విషాదం జరిగింది అనేది సినిమా.

గత ఏడాది కాలంగా గమనం సినిమాకు సంబంధించిన ప్రమోషన్ వీడియోలు మరియు పోస్టర్ లు సందడి చేస్తూనే ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా సినిమా పై అంచనాలు పెంచే విధంగా మాట్లాడారు. నిత్యా మీనన్‌ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతుంది. ఆమె సింగర్ గా వింటేజ్ లుక్ లో కనిపిస్తుంది. మొత్తానికి ఈ సినిమా అన్ని రకాల మనుషులను అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే కథను కలిగి ఉందని ట్రైలర్‌ చూస్తుంటే అర్థం అవుతుంది. కనుక సినిమా తప్పకుండా ఆకట్టుకునే విధంగా ఉంటుందనే నమ్మకంను ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు.