Begin typing your search above and press return to search.

మాస్ కా దాస్ దివాళీ దావ‌త్ కి అంతా రెడీ!

By:  Tupaki Desk   |   19 Oct 2022 8:30 AM GMT
మాస్ కా దాస్ దివాళీ దావ‌త్ కి అంతా రెడీ!
X
మాస్ కా దాస్ విశ్వ‌క్ సేన్ హీరోగా న‌టించిన‌ మూవీ 'ఓరి దేవుడా!'. మిథిలా పాల్క‌ర్‌, ఆశ భ‌ట్ హీరోయిన్ లుగా న‌టించారు. విక్ట‌రీ వెంక‌టేష్ కీల‌క పాత్ర‌లో దేవుడిగా న‌టించిన ఈ మూవీని అశ్వ‌త్ మారి ముత్తు డైరెక్ట‌ర్ చేశారు. త‌మిళ హిట్ ఫిల్మ్ 'ఓ మై క‌డ‌వులే' ఆధారంగా ఈ మూవీని తెలుగులో రీమేక్ చేశారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్, పీవీపీ సినిమా బ్యాన‌ర్ ల‌పై సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ దీపావ‌ళి సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 21న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

'అశోక వ‌నంలో అర్జున క‌ల్యాణం' వంటి హిట్ సినిమాతో మంచి జోష్ లో వున్న విశ్వ‌క్ సేన్ 'ఓరి దేవుడా' మూవీపై భారీ అంచ‌నాలే పెట్టుకున్నాడ‌ట‌. ఈ సినిమాలో సీనియ‌ర్ హీరో విక్ట‌రీ వెంక‌టేష్ కీల‌క అతిథి పాత్ర‌లో దేవుడిగా క‌నిపించ‌బోతున్నారు. విశ్వ‌క్ సేన్ రిక్వెస్ట్ చేయ‌డం వ‌ల్లే వెంక‌టేష్ ఈ మూవీలో గెస్ట్ క్యారెక్ట‌ర్ లో న‌టించ‌డానికి అంగీక‌రించార‌ట‌. త‌ను ఈ ప్రాజెక్ట్ లోకి వ‌చ్చాకే ఈ మూవీపై బ‌జ్ క్రియేట్ కావ‌డం మొద‌లైంది.

దీపావళి రేసులో రెండు డ‌బ్బింగ్ సినిమాల‌తో పాటు రెండు స్ట్రెయిట్ సినిమాలు రిలీజ్ అవుతున్న విష‌యంలో తెలిసిందే అందులో విశ్వ‌క్ సేన్ 'ఓరి దేవుడా!' హాట్ ఫేవ‌రేట్ గా నిల‌చింది. సినిమా రిలీజ్ ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో చిత్ర బృందం ఇటీవ‌ల ప్ర‌మోష‌న‌ల్ యాక్టివిటీస్ ని స్పీడ‌ప్ చేసేసింది. ఇటీవ‌ల రాజ‌మండ్రిలో ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుక‌ని నిర్వ‌హించారు.

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా పాల్గొన‌డంతో సినిమాపై మ‌రింత హైప్ క్రియేట్ అయింది. తాజాగా అక్టోబ‌ర్ 19 బుధ‌వారం హైద‌రాబాద్ లో దివాళీ దావ‌త్ పేరుతో భారీ ఈ వెంట్ ని ప్లాన్ చేసింది చిత్ర బృందం. ఈ ఈవెంట్ లో సినిమాలో కీల‌క అతిధి పాత్ర‌లో న‌టించిన విక్ట‌రీ వెంక‌టేష్ టీమ్ తో పాటు పాల్గొన‌బోతున్నారు. దీంతో ఈ మూవీకి మ‌రింత హైప్ క్రియేట్ కావ‌డం ఖాయం అని ట్రేడ్ వ‌ర్గాలు, చిత్ర బృందం భావిస్తోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.