Begin typing your search above and press return to search.
కలకత్తా వెళ్లకుండా అంతా ఇక్కడే
By: Tupaki Desk | 8 Nov 2020 4:00 PM ISTనాని హీరోగా రాహుల్ సంకీర్త్యన్ దర్శకత్వంలో రూపొందుతున్న శ్యామ్ సింగరాయ్ మూవీ ప్రస్తుతం హైదరాబాద్ శివారులోని అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన కలకత్తా సెట్టింగ్ లో నిర్వహిస్తున్న విషయం తెల్సిందే. మరి కొన్ని రోజుల్లోనే ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి కాబోతుంది. ఆ వెంటనే అల్యూమినియం ఫ్యాక్టరీలోనే పాటల కోసం మళ్లీ కలకత్తా సెట్టింగ్ ను నిర్మించబోతున్నారట. కరోనా టైం అవ్వడం వల్ల షూటింగ్ లకు ఎక్కువ రోజులు ఇతర ప్రాంతాలకు వెళ్లడం.. ఎక్కువ మందిని తీసుకు వెళ్లడం ప్రమాదంగా భావిస్తున్నారు. అందుకే అక్కడ చిత్రీకరించాలనుకున్న సీన్స్ ను ఇక్కడే సెట్టింగ్ లో పూర్తి చేస్తున్నారట.
నాని లాక్ డౌన్ టైమ్ లో 'వి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా నిరాశ పర్చింది. దాంతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలను వచ్చే ఏడాది విడుదల చేసేందుకు సిద్దం అవుతున్నాడు. మొదటగా టక్ జగదీష్ సినిమా రాబోతుంది. శివ నిర్వాన దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల అయ్యే అకవాశం ఉంది. ఇక రాహుల్ దర్శకత్వంలో నాని చేస్తున్న శ్యామ్ సింగరాయ్ సినిమాను వచ్చే ఏడాది దసరా సీజన్ లో విడుదల చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా కనిపించబోతుంది. మరో హీరోయిన్ గా ఉప్పెన ముద్దుగుమ్మ కృతి శెట్టి నటించబోతుంది. ఈ సినిమాలో నాని విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ట్యాక్సీవాలా సినిమాతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న దర్శకుడు ఈ సినిమాతో మరో విజయాన్ని సొంతం చేసుకునే అవకాశం ఉందని అంటున్నారు.