Begin typing your search above and press return to search.

అంద‌రికీ అన‌సూయ కావాల‌ట‌..!

By:  Tupaki Desk   |   7 Feb 2021 9:50 AM GMT
అంద‌రికీ అన‌సూయ కావాల‌ట‌..!
X
ప్రస్తుతం బుల్లితెరను ఏలుతున్న లేడీ యాంకర్లలో ముందువరసలో ఉంటుంది హాట్ బ్యూటీ అనసూయ. ఆకర్షించే అందంతోపాటు అద్బుతమైన టాలెంట్ ఉన్న అనసూయ.. టెలివిజన్ స్క్రీన్ పై తనదైన ముద్రవేసింది. ఆ తర్వాత వెండితెరపైనా తన టాలెంట్ చూపిస్తోంది. అయితే.. ఈ అమ్మ‌డి పెర్ఫార్మెన్స్ కు ఫిదా అయిపోయిన మేక‌ర్స్ త‌మ సినిమాలో అనసూయ ఉండాల్సిందేన‌ని భావిస్తున్నార‌ట‌.

చిన్న చిన్న పాత్ర‌ల‌తో వెండి తెర‌పై త‌ళుక్కున్న మెరిసిన అమ్మ‌డు.. ఆ త‌ర్వాత రంగస్థ‌లం, క్ష‌ణం వంటి చిత్రాల‌తో అంద‌రి దృష్టినీ ఆకర్షించింది. ఆ త‌ర్వాత ‘కథనం’ చిత్రంలో ఫుల్ లెంగ్త్ రోల్ లో నటించి మెప్పించింది. దీంతో.. అందం, అభినయం కలగలిసిన ఈ బ్యూటీకి తమ సినిమాలో ఛాన్స్ ఇచ్చేందుకు క్యూ కడుతున్నారు మేకర్స్.

ప్రస్తుతం తన కిట్ లో ఉన్న సినిమాల లిస్ట్ చూస్తేనే అర్థమవుతోంది.. అనసూయ ఎంతగా మోస్ట్ వాంటెడ్ యాక్ట్రెస్ అయ్యిందన్న సంగతి! ఇప్పుడు చాలా మంది నిర్మాతలకు హాట్ ఫేవరెట్‌గా మారింది అనూ. ప‌లు సాలిడ్ మూవీస్ లో ఆమె న‌టిస్తోంది. ఒక‌టీ రెండు కాదు.. వచ్చే ఏడాది నాటికి ఈ బ్యూటీ కనీసం అరడజను సినిమాల్లో క‌నిపించ‌నుంది!

క్రియేటివ్ డైరెక్ట‌ర్‌ కృష్ణవంశీ తెర‌కెక్కిస్తున్న ‘రంగ మార్తాండ’లో ఓ ఎమోషనల్ క్యారెక్టర్లో నటించబోతోంది అనసూయ. రవితేజ అప్ కమింగ్ మూవీ ‘ఖిలాడి’లో మరో దృఢమైన పాత్రలో నటించబోతోంది. ఇక, ‘థాంక్స్ బ్రదర్’ చిత్రంలో గర్భవతి అయిన మహిళగా ఛాలెంజింగ్ రోల్ పోషించబోతోంది అనసూయ. ఇవేకాకుండా మరికొన్నిచిత్రాలు కూడా లైన్లో ఉన్నాయి.

త్వరలోనే ‘ది చేజ్’ అనే చిత్రం ద్వారా తమిళంలోకి అడుగుపెట్టనుంది అనసూయ. అదేవిధంగా.. కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతితో కలిసి ఒక సినిమా కూడా చేస్తోంది అనూ. ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’లో ఓ పవర్ ఫుల్ రోల్ ఆఫర్ చేశాడట సుకుమార్. ఇది ఇంకా కన్ఫామ్ కాలేదు. ఈ విధంగా వరుస ఆఫర్లతో దూసుకెళ్తోందీ బుల్లితెర సోయగం. ఈ లెక్కన.. రాబోయే సినిమాల్లో తన వెర్సటైల్ యాక్టింగ్ తో ఆడియన్స్ ను అలరించబోతోంది అనసూయ.